పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

101

ద్వితీయప్రకరణము

విను రామ! సంసార - విభ్రమ వ్యథలు
మనమునందే పుట్టు - మాయ నీ కిపుడు

తెలియుట కిది చెప్పి - తిని, మానసమును
నిలిపి శాంతిని బొంది, - నెమ్మది నుండు!

చెలఁగి వివేకంబు - చేఁ జిత్తశాంతి
గలుగ, సంసార దుః - ఖ మణంగిపోవు; 200

నిలను వివేక వి - హీన చిత్తునకుఁ
గలుష సంసార దుః - ఖము వృద్ధిఁబొందు;

సతతంబు నాత్మ వి - చారంబు సేయు
నతని చేతోవృత్తు - లణఁగి నశించు;

వడిగొన్న సంసార - వాసన మరలఁ
బొడమినయపుడు తె - ప్పునఁ దా విరాగ

మతినొంది, సంసార - మనిన వర్జించి,
హిత మొప్పఁ దన్నుఁ దా - నెఱుంగు చుండఁగను

సరవి సంసార వా - సన మూషకములు
కొఱికిన వలరీతిఁ - గ్రుస్సి నశించు; 210

తెరలి మనోగ్రంథి - తెగు, నటు మీఁదఁ
బరమ విజ్ఞాన స్వ - భావంము మించి

నిత్య ప్రనన్నమై - నిండుచునుండుఁ;
బ్రత్యక్ష మీ యను - భవము భావించు

నట్టి యోగాభ్యాసి - యైన పూరుషువి
పట్టైన కరుణకు - బ్రహ్మాదిసురలు

తగుపాత్ర లగుదు రం - తటి యోగివర్యుఁ
డగణిత చరితుఁడై - యన్ని దిక్కులను