పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

వాసిష్ఠరామాయణం

తనజన్మదుఖముల్ - దలఁచుచు వగచి,
యెనసిన భక్తి న - య్యిరువురఁ జూచి,

పలికె ని ట్లని 'నేను - బహుజన్మదుఃఖ
ములఁ బొంది యలసితి - మోహంబుచేత,

మున్ను మీ సాన్నిధ్య - మున నుండ కరిగి,
యన్ని దుఃఖసుఖంబు - లనుభవించితిని,

ఎఱృక చిన్మాత్రమై - యెల్ల దిక్కులను
మెఱయుచు నున్న దే - మి కొఱంత లేదు

కనుఁగొంటి ముక్తి మా - ర్గంబు, మత్పూర్వ
తనువులోఁ జేరి మీ - తనయుండ నగుచుఁ 180

జెదరక మీ సేవఁ - జేసేద ననిన
వదలని కృప మీఱ - వా రిద్ద ఱతని

వెంటఁ దోడ్కొనిపోయి, - వింతగా నేల
నంటి కృశీ భూత - మైన దేహమును

జూపఁగాఁ జూచి, యా - శుక్రుఁ డీతనువు
నాపట్లఁ బడ వైచి, - యంతకు వరము

చేఁ బూర్వతనువులోఁ - జేరి యచ్చోట
దీపింపఁగాను ద - ద్దేహింబు లేచి

తన తండ్రి చెంత య - థా ప్రకారముగ
వానర సుఖస్థితి - నుండఁగాఁ జూచి, 190

శమనుండు నిజనివా - సంబున కరిగె
నమితసంతోషాత్ముఁ - డయ్యె భృగుండు.

అని శుక్రు వృత్తాంత - మా వపిష్ఠుండు
మనుజేంద్రునకుఁ జెప్పి మరల ని ట్లవియె: