పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

99

ద్వితీయప్రకరణము

జని తమాలమహీ జ - జాల మధ్యమున
వనకుక్కుటంబయ్యె - వాఁ డివ్విధమున 150

సారె కీగతి బహు - జన్మంబు లెత్తి,
ధారుణి మీఁదఁ ద - త్తనువుల విడిచి,

యతిదుఖభాజియై - యాత్మ వివేక
గతి మది న్మఱచి, గం - గాతీరమందు

భూసురోత్తమునకుఁ - బుత్రుఁడై పుట్టి,
వాసుదేవాఖ్య న - వ్వలఁ దపొవేష

కలితుఁడై నిలిచి,'య - క్కడ తపంబునను
వెలుఁగుచు నెను మిది - వేలేండ్ల నుండి

అచట నున్నాఁడు మ - హాయోగివలెను
సుచరిత్ర! యిఁక వానిఁ - జూచెద ననినఁ 160

జూపెద, నీ విప్దు - సుజ్ఞాన దృష్టి
దీపింపఁ జేయుచు - దివ్యదేహమును

ధరియించి రమ్మన్నఁ - దపసి యా రీతి
నరుదైన దివ్య దే-హంబునుఁ దాల్చి,

తెప్పున భాగీర - థీతీరమునకు
నప్పు డయ్యమునితో - నరిగి, వా రచటి

కతికృశీభూతాంగు - లై శుక్రుకడకు
హిత మొప్పఁ జనఁగ వాఁ - డెదురుగా వచ్చి

మొక్కఁగా, నతనికి - మోక్షమార్గంబుఁ
జక్కఁగా దెలుప, సు - జ్ఞానియై యతఁడు 170

1. మర్కట తపంబునను- వేం.