పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

వాసిష్థరామాయణము


యవనినిఁ దద్దేహ - మట విసర్జించి,
యవల విద్యాధరుఁ - డై జనియించి,

రహి నొప్పు నలకాపు - రంబందు నుండి,
విహరించి యా బొంది - విడిచి, పిమ్మటను,

మఖియొక్క మౌని కు - మారుఁడై పుట్టి,
యఱిముఱి సర్వేంద్రి - యముల నడంచి,130

తివిరి సరస్వతీ - తీరంబునందుఁ
బ్రవిమలుం డగుచుఁ ద - పముఁ జేసి, తనువు

జగతిపైఁ బడవైచి, - సౌరదేశమున
మగుడఁ దానొక్క సా - మంతుఁడై పుట్టి,

కొంతభూ మేలుచుఁ - గొన్నియేం డ్లుండి,
యంతటఁ దద్దేహ - మచ్చట విడిచి,

క్రమ్మఱఁ బోయి త్రి - గర్త దేశమున
సమ్మతంబుగ మహా - శైవుఁడై పుట్టి,

లలితుఁడై బహు శిష్యు - లకు నుపదేశ
ములు చేసి, తద్దేహ - మును విసర్జించి,140

చనియా కిరాతదే - శమున వొక్కెడను
గొనకొని యొక వేణు - గుల్మమై పుట్టి,

చని యొక భూమిలో - శ్వానమై తాను
జనియించి, యందుండి - చని, యొక్క చోట

హరిణమై యుదయించి - యా శరీరమును
ధరణిపైఁ బడవైచి, - తాళవృక్షమునఁ

బసచెడ నొక పెనుఁ - బామై జనించి,
వసుధఁ దత్తన్నువును - వాల్చి, యామీఁదఁ