పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95

ద్వితీయప్రకరణము

యఱిముఱి సూక్ష్మదే - హంబుతో నెగసి,
మరులొంది దాని వి - మానంబుఁ జేరి,

తెఱఁగొప్పఁగా దివ్య - దేహంబుఁ దాల్చి,
నెఱవాది యగుచు దా - నినిఁ గూడి, యవల

సొలసి జన్మాంతర - సుఖ దుఃఖ సరణి
నలజడిఁ బడుచుండె - నందందు, నిచట

నలర నాభృగుని మ - హాతపోబలము
వలన శుక్రాంగంబు - వనములో వ్రాలి 50

యున్నఁ దద్దేహంబు - నుగ్ర జంతువులు
పన్నుగాఁ గని, - పట్టి భక్షింపకుండె

వలనొప్ప నట దివ్య - వర్షసహస్ర
ములకు సమాధి ని - మ్ముగ వీవిడి, భృగుఁడు

శుక్రాంగమును జూచి - శోకించి, మించి
యాక్రోశచిత్తుఁడై - యంతకుమీఁదఁ

గోపంబు రెట్టింపు - ఘోరమై నట్టి
శాప మియ్యఁదలంచు - సమయంబునందు

సదరుచు మహిష వా - హన మెక్కి వచ్చి,
పదరెడి భృగుమౌని - పజ్జను నిలిచి, 60

పలికి ని ట్లని దండ - పాణి 'మునీంద్ర!
లలిమీఱఁ బెద్ద కా - లముఁ జేసినట్టి

తపమెల్లఁ జెడుటకై - తామసబుద్ధి
నిపుడు శాపంబు నా - కియ్యఁ బూనుచును

ఈ కరణినిఁ గన్ను - లెఱఁ జేసితివి,
నీ కపకారంబు - నేఁ జేయలేదు