పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

వాసిష్టరామాయణము

గనిపింపుచుండుఁ; ద - త్కథ వినిపింతు
విను చిత్రవర్ణముల్‌ - వెదకిన లేక,

కొమరొప్పఁగాఁ జిత్ర - కుఁడు లేక మింట
నమరి చిత్తరు వుండి - నటువలె, నిదుర

లేకయే కలవచ్చు - లీల, నద్దమునఁ
బ్రాకటంబుగఁ గన - బడు నీడవలెను,

సతతప్రకాశమౌ - స్వచ్ఛాత్మయందుఁ
బ్రతిబింబ మగుచుఁ బ్ర - పంచంబు దోఁచు

గనుకఁ బ్రపంచంబు - కల్లగా నెఱుఁగు,
మనుపమాత్మనుజూడు - మంతరంగమునఁ,

జపలాత్ములై ప్రపం - చముఁ జూచు మనుజు
లపరిమితాఘ దే - హములఁ బొందుదురు;

జననాథ! దీనికి - సాదృశ్య మొకటి
వినిపింతు, నెట్లన్న - విప్రపుంగవుఁడు

*శుక్రోపాఖ్యానము*



విమలుండు భృగుఁడు - వివేకభావమున
నమితసుందర పర్వ - తారణ్యు మందుఁ

దప మయుతాబ్దముల్‌ - తగఁ జేయ, శుక్రుఁ
డపుడు తండ్రికి సేవ ల - మరఁ దాఁ జేయ

వలసి, యందుండి వి - శ్వాచి యనంగఁ
జెలువొప్పు నప్పర - స్త్రీని వీక్షించి,

మోహించి మదనాస్త్ర - ముల కోరి, నైజ
దేహ మయ్యడవిలోఁ - దెప్పున విడిచి,