పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ ప్రకరణము

శ్రీతారకోల్లాస! - శేషాద్రివాస!
శ్రీతరిగొండ నృసింహ! ధూతాంహ!

విన్నవించెద నది - వినుము వాల్మీకి
పన్నుగా దెల్నె ను - త్పత్తి క్రమంబు,

తప్పక విని భర - ద్వాజుండు మరల
నప్పు డిట్లనియె 'మ - హాగురు దేవ!

శ్రీరాఘవునకు వ - సిష్ఠుండు మరల
నే రహస్యముఁ జెప్పె - నెఱింగింపుఁ'డనిన

నలర వాల్మీకి యి - ట్లనె 'భరద్వాజ!
తెలియఁ జెప్పెద నది - తేటగా వినుము! 10

శ్రీరాఘవుండు - వాసిష్ఠు నీక్షించి
యారూఢభక్తి ని - ట్లనె 'నో మునీంద్ర!

చిత్తమందే సర్వ - సృష్టి పుట్టుటయుఁ,
జిత్తవృత్తులు విస - ర్జించుట ముక్తి

యగుటయుఁ జెప్పితి - రానంద మొదవె
నగణిత చరిత! కృం - తార్థుండ నైతి'.

ననిన వసిష్ఠుఁడి - ట్లనియె వెండియును
'జననాథ! యీ ప్రపం - చము మానసమున

జనియించి, యందుండు, - సంసార మాత్మ
నెనసి యున్నటువలె - నిలఁ జిత్తమునకుఁ 20