పుట:Varavikrayamu -1921.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

వరవిక్రయము


    దేనియు సాధ్యమే మఱువ నీ దురదృష్టపు జీవితంబునన్‌!

సీ. ఎన్నడుఁ నామాట కెదురు చెప్పఁగలేదు!
        తండ్రి గీచిన గీటు దాటలేదు!
    బడియన్న నెన్నఁడు బ్రాలుమాలఁగ లేదు!
        రాట్నంబు నెడలఁ బరాకు లేదు!
    అది నాకుఁ గావలె నని యెన్నఁడన లేదు!
        కుడుచునప్పుడుఁ గూడ గొడవ లేదు!
    ఆటలయందైన -నలుక యెన్నఁడు లేదు!
        పొరుగింటి కేనియుఁ బోకలేదు!

    కలికమున కేనియును నోటఁ గల్లలేదు!
    మచ్చునకు నేనియుం బొల్లుమాట లేదు!
    అట్టి బిడ్డను బ్రతికియున్నంత వరకు
    మరువ శక్యమె! వెఱ్ఱి బ్రాహ్మణుఁడ నాకు!

పురు :- అహర్నిశము లిట్లు వలపోయుచు ఆ బిడ్డ నడలఁగొట్టెదవా?

తే. ఎంత చెప్పిన విన విది యేమి వెఱ్రి
    యెవరి పనియైన తరువాత నెవ్వరుంద్రు?
    నాటకములోని వేషగాండ్రకును మనకు
    నించుకేనియు భేదమెందేని గలదె!

పేర :- అంతేనమ్మా! అంతె. బొమ్మలాటకాడేంచేస్తాడు? ఏ బొమ్మ పని వచ్చినప్పుడా బొమ్మను తెరమీది కెక్కిస్తాడు. ఆ బొమ్మ పని కాగానే అడుగున పారేస్తాడు. అలాగునే భగవంతుడూను! ఇంతెందుకూ? ఇరవయేళ్ళ నుంచి వున్న పొడుంకుండు మొన్ననిట్టె పగిలిపోతె, నేనేమి చెయ్యగలిగాను! ఏడిస్తే వచ్చేలాగుంటే యెన్నాళ్ళేడవమన్నా యేడుస్తును!

పురు :- ఏమే? యీ విషయమునందు నీ యభిప్రాయమేమిటి?

భ్రమ :- (కన్నులు తుడుచుకొని) మన యభిప్రాయములకు ఫలితముగా మనకు జరగవలసిన శాస్తి జరగనే జరిగినది. యింకను మన యభిప్రాయముల మీదనే నడచినచో ఈ యమ్మకేమి బుద్ధిపుట్టునో