పుట:Varavikrayamu -1921.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము

67

పేర :- ఏం తేలిందని మనవి చేయను? మీరు నాన్‌కోపరేటర్లనీ, కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూర్చున్నాఁడు.

పురు :- అందులకిప్పుడు మన మాచరింపవలసిన పని యేమిటి?

పేర :- నేనేం మనవి చెయ్యను? కోటి వరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్ళడం ధర్మము కాదు. అకారణంగా అంత సొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మం కాదు. ఈ చిక్కులన్నీ ఆలోచించే చిన్నమ్మాయి నా చిన్నవాడికే యిస్తే తీరిపోతుందని మనవి చేశాను.

పురు :- అయిదువేల యైదువందలు నా బ్రాహ్మణుఁడు హరించినను సరియే కాని యిక నాయనతో సంబంధము నాకిష్టము లేదు!

చ. పరువుఁ బ్రతిష్టయుం గనక, పాపభయంబను మాటలేక యి
    క్కరణి ధనంబె జీవితముగా దలపోసెడు వానితోడఁజు
    ట్టరికముచేసి, నిత్య మకటా! యని చింతిలుకంటె, గౌరవా
    దరపరు లౌ గృహస్థుల పదంబులపైఁ బడవైచుటే తగున్‌!

పేర :- బాబూ! యీ విషయములో మీరిల్లాటి పట్టుదల పెట్టుకోవలసిన పనిలేదు. ఆయన మీద రోతచేత ఆయన పిల్లవాణ్ని పోగొట్టుకోవడం నా అభిప్రాయము కాదు. ఏబయ్యేళ్ళ ముండాకొడు ఎన్నాళ్లు బ్రతుకుతాడు. ఆ తరువాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండఁగా అంత సొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు త్రొక్కడమా అని సందేహించడం ఆలోచన తక్కువ పని కాదూ? అమ్మా! మీరల్లా వలపోస్తూ ఏమీ చెప్పకపోతే యెల్లాగ? యేదో విధంగా మరచిపోవాలి కాని యెల్లకాలం అదేపనిగా విచారిస్తూ వుంటే యెల్లా సాగుతాయి వ్యవహారాలు?

భ్రమ :- (కన్నీటితో ) అయ్యా పేరయ్యగారూ!

ఉ. ఆ నునుచెక్కు, లా పెదవు, లా మొగ మామురిపెంపు భ్రూయుగం,
    బానొస, లా శిరోరుహము, లా మృదువాక్యము, లామృదుస్వరం
    బా నయనంబుఁ, లా నడక, యా వినయం బకటా! సుషుప్తియం