12
శ్రీ మ దు త్త ర రా మా య ణ ము
ననియు, నిట్టి కవితాధార యేవుణ్య పురుషునకో గాని యెల్లర కలవడదనుటలో నతిశయోక్తి లేదనియు మా నమ్మకము, ఇటుల వ్రాసినందులకు భావ నవ్యసాహిత్య వస్తోంది పోతోంది వచ్చారు పొయ్యారు వ్రాతల వ్రాయు కవిపుంగవులు మాపై గుడ్లెఱ్ఱ జేసినఁ జేయవచ్చును, కాని యందులకు భయఁపడి సత్యమును దాఁచుట తప్పు కదా?
కంకంటి వారి ఉత్తర రామాయణమును జదివినచో ఉత్తరరామాయణముతో, బాటు రామాయణమును గూడ జదివి నట్లగుననుట కీకవిపుంగవుఁ డిందు సంగ్రహముగ ఎనుబదియేడు పద్యములలో రచించి ముగించిన రామాయణమును జదివినవా రెఱుంగఁ గలరు. ఈ గ్రంధమును సంపూర్ణముగఁ జదివినను, పురాణ శ్రవణము గావించినను శ్రీమద్రామాయణమును ఉత్తర రామాయణమును జదివిన ఫలమును బొందఁ గలరు. ఇట్టి యుత్తమగ్రంథమును పండితులచే సరిచూపించి కాకితము లభింపని యీ కఱవు దినములలో వ్యయ ప్రయాసల లెక్కింపక మంచి కాగితములపై జక్కఁగ ముద్రించి సామాన్యుల కందు బాటగు మూల్యమును నిర్ణయించితిమి. ఇందేమైన ఇంకను పొరపాట్లుండినచోఁ బాఠక మహాశయులు మాకు దయతోఁ దెలిపిన రెండవ ముద్రణమున సవరింపఁ గలము. ఆంధ్రలోకము ఆంధ్రభారతికి మేమొనరించు సేవ నెట్లుఁ బోత్సహించునో చూడవలసి యున్నది.
సి. వి. కృష్ణా బుక్కు డిపో.