6
శ్రీ మ దు త్త ర రా మా య ణ ము
దానిని ప్రభువున కీ దలఁచి నట్లును జెప్ప నా ప్రభువు కవిద్వయమును బోనాడఁ జాలక నిరువురి గ్రంథముల నందుకొనె ననియు; అట్లందుకొనుటలో రంగనాథ రామాయణమును గుడి చేతను, భాస్కర రామాయణమును నెడమ చేతను నంచుకొనుట చే భాస్కరుఁడు తన పొత్తమునకు వన్నె తఱిగినట్లు భావించి ప్రభువు పై గినిసి నరాంకితము కంటే భగవదంకితమె లెస్సయని శ్రీకృష్ణ భగవానున కర్పించె ననియుఁ జెప్పుదురు. ఇట్టి యంశము లన్నిటిని నిచ్చటఁ జర్చించుటకంటే శ్రీరాముని చరితంబును నాంధ్రీకరించిన వారిలో భాస్కరకవిచంద్రుఁఁడు రెండవ వాడని పాఠకులకు మనవి చేయుచున్నాము.
గోపీనాథకవి - శ్రీరామచంద్రుని దివ్యచారిత్రమును దెనిగించిన వారిలో నీకవి పుంగవుఁడు మూఁడవ వాఁడుగ గణింపఁ బడెను. ఈతడు నెల్లూరు మండలము నందలి కావలి తాలూకా యందలి లక్ష్మీ పురమున జన్మించె ననియు నిక్కవి వుంగవుని వంశమున కాదిపురుషుఁడు గోపీనాథుని వేంకటశాస్త్రి యనియు, వేంకటశాస్త్రికిఁ గామాక్షీ దేవియను కళత్రము వలన బుచ్చన [బుచ్చనార్యుఁడు] యుదయించె ననియు ఆ బుచ్చనార్యునకుఁ గోనమాంబయను భార్యవలన నరస శాస్త్రి, జనించె ననియు ఆతనికి వేంకటాంబ వలన పద్మనాభ శాస్త్రి, బుచ్చన్న అను పుత్రులు జన్మించి రనియు నందు పద్మనాభునకు లక్ష్మీ దేవి యను నర్థాంగి వలన వేంకటనాథుఁడు అను పుత్రుఁడు జనించె ననియు ఆ వేంకటనాథుడే గోపీనాథ రామాయణమును రచించె ననియుఁ దెలియు చున్నది.
ఈ కవికుల తిలకుఁడు పై రంగనాథ భాస్కరుల వలెనే రామాయణమును వాల్మీకి రామాయణము ననుసరించియే గద్యపద్యాత్మికముగ రచించి భాస్కరుని వలెనే తన కృతిని నరాంకిత మొనరింపక శ్రీకృష్ణ భగవానున కర్పిత మొనరించి శ్రీ రామచంద్రుని కరుణా కటాక్షమునకుఁ బాత్రుఁడై స్వర్గము నలంకరించెను.
ఆంధ్ర వాల్మీకి - రాయలసీమలోఁ గడప మండలము పూర్వము నుండియు మహాకవులకు జనస్థానమై వెలయు చున్నదని వ్రాయుటలో నతిశయోక్తి దోసముండునని పాఠకులు భ్రమింప కుందురు గాక.
అట్టి కడప మండలము నందలి జమ్మలమడుగు పట్టణమున నాంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు, ఆవల వాసుదాసు అని పిలువఁ బడెడి ఆంధ్రవాల్మీకి జనించెను, ఈ కవికులఁ తిలకుఁడు బహుగ్రంథకర్తయై భక్తశిఖామణి యని పించుకోని బమ్మెర పోతనామాత్యుని వలె రామభక్తుఁడై, ఒంటిమిట్ట యని పిలువంబడు నేకశిలా నగరమందే యాశ్రమము నేర్పఱచుకొని, బమ్మెర పోతనా