పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 బ్రహ్మవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము.


నారాయణమహర్షి యిట్లనియె. ధర్మధ్వజునికిం బత్ని మాధవి యని ప్రసిద్ధిఁ జెందినయది. ఆసుందరి గంధమాదననగము నందుం బూల వాసనలు చందనవాసనలు వెదజల్లు మారుత మొలయు చుండురమణీయ స్థలమునఁ, బుష్ప చందనచర్చితం బయి రతికరం బయి యుండుళయ్యం గామిచుకొని తాను సర్వాంగములందుఁ జందనం బలందుకొని యా నారీరత్న మతిమనోహరమగుశరీరమున రతనంపు సొమ్ములు చేసికొని యాకాముకి రసిక లగుకాంతలకుం దలక జై యుండునది యగుటంజేసి రసిశాసనసంయుత యగుచు రాజుతో సురతసౌఖ్యం బనుభవించెను. రతి చాతుర్యం బెఱింగినవా రగుటంజేసి వారికి రతివిరతి లేక యుండె. అప్పుడు,

ఉ. కామినిముద్దుపల్కు లలకాయజవీరునిసింహనాద మై
భామినిగుబ్బచన్మొనలపంతపుఁబోటులు కామువ్రేటు లై
సామజయానచూపుగమి సారస బాణుని బాణవృష్టి యై
యామనుజేశుఁ గామకలహంబునఁ దాఁకి కరంచెఁ దాలిమిక్షా.

ఇట్టు లారసికవరులు రేయింబగ ల్లేఱుంగక నూఱుది వ్యవర్ష ములు కామసుఖం బనుభవించుచుండిరి. అంత నారాజు మతిం జెంది సురతము వలన విరమించుకొనియె. ఆసుందరి కాముకి యగుటంజేసి యొకించుకఁ

శ్రీతులసీదేవి యవతారము.

దృష్తిం జెందక యుండెను. ఆసతి యది దొట్టి నూఱుదేవవర్షములు గర్భముఁదాల్చెను, ఆరాజపత్ని శ్రీగర్భ యగుటంజేసి దినదినమునకు శీయుత యగుచు వచ్చెను. ఓపద్మభవుని కుమారుఁడా ఆకాంతామణి ర్తీకమాసమునం బున్న మనాఁడు శుక్రవారంబున శుభయోగసం యుతం బయినశుభదినమున శుభక్షణమున శుభ స్వామిగృహాన్వితం బైన శుభాంశమునఁ బద్మాంశసంభవ యగునారీమణిం గనియె, ఆకన్యక; పద్మ ముల కొప్పయినపాదయుగళమునందుఁ బద్మ రాజి చిహ్నములు; గలిగి