పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 బ్రహ్మవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము. 03

రాజరాజేశ్వరీలక్ష్మీ రూపిణి యయి; యాయతము లగు సర్వాంగములును రాజలక్ష్మీ చిహ్న ములును గలిగి; రాజలక్ష్యధి దేవతయై యొప్పుచు; శారద పూర్ణి మా 'చంద్రునిఁ బోలుమొగమును, శరత్వంకజములకుఁ దుల్యము లగులోచనములును, పరిపక్వ మగుబింబఫలమున కొస్పయినయధర మును, ఆరక్తము లగుహస్తపాదతలములును, మనోహర మయి నిమ్న మగునాభియు,తదూర్ధ్వభాగమునఁ ద్రివళులును, వర్తులము లగునితంబ ములును, న్యగ్రోధపత్రమునకు సమాన మగునుదరమును గలిగి; శీత కాలసుఖోష్ణము లగుచు గ్రీష్మ మునందు సుఖశీతలము లగుచు నొప్పు సర్వాంగములతో నతిరుచిరయు శ్యామయు నయి; శ్వేతచంపక సుమ వర్ణ ముగలిగి; సౌందర్యవతులకంటె సౌందర్యవతి యనందగి; స్మితసుధా మధురముగ సూతికాగారమును గాంచుచుండై ఆకన్యకను జూచి,

(సీ॥ క్షీరనీరధికన్య చెలువకు సాటి యే జడజ యనం K. నాచాన యొప్పు
నాపులోమజ తుల్య యనవచ్చునే నాతి కాసుర ప్రకృతి యాయజ్జ నేత్ర
యుమ సరిపోలు నీరమణి కం చనరాదు భిక్షుక కాంత యాభృంగ వేణి
రతి యీసతికిఁ దుల్యరమణి యౌనా యేమి దగ్ధత నాధ యాతలిరుబోణి
సర్వశుభలక్షణంబుల జగములందు । గొప్పగా నుండువారికే కొఱఁత లుండ
సాటి యే యన్య లీబోటిగోటి కైన 1 సొగసుకత్తెలు సర్వాంగసుందరికిని.)

అనియివ్విధమున నాడుకొనుచు నచ్చట కేగుదెంచినజను లందఱు సనపద్యశుభలక్షణో పేత యగునాశారో దరికిం దుల్యగుణరూపవతు లగుమదవతుల నిరూపింప లేక యానాతికిం దులన లేమింజేసి. తులసియను నామంబు సెల్లు నని పల్కిరి. ఇది పురావిదులు బేర్కొ నినయర్థంబు. అంత, శ్యామ యు నాయతాంగి యు నగు నాతులసి భూమిపయిం బడి నయంతట న నవ్వుచు సూతికాగారముఁ గలయం గనుంగొని లేచి యాసూతికాగారము నిర్గమించి ఎల్ల వారుని షేధించిననునిలువక తపము సేయుటకు బదరీవనమునకుఁజనియె. ఆయమ యచటఁ దనకు నారాయ ణుండు పతి గావలయు నని నిశ్చయించుకొని లక్ష దేవవర్ష ములు పరమం