పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవ కమహాపురాణము, ప్రకృతి ఖండము.

యముఁ బాపు మని యడిగిన నారాయణుం డిట్లనియె. ఓనార చా! లంక యందు వాస్తు యగుసీత రామునిం జెందెను. వహ్ని చే సృజియింప బడిన చ్ఛాయాసీత రూపయౌవనసంపన్ను ఆ లయియుండునది యా రామవహ్ను లయాజ్ఞ చేఁ దపముఁ గావించి శంకరుని వరము వేడెను. ఆయమ కామాతుర యగుటం జేసి పతివ్యగ్ర యయి హేత్రిలోచన పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, అని యయిదు మాఱులు మరల మరల ప్రార్థనము గావించెను. శివుండు తతాధ నము విని నవ్వుచు నారసి కేశ్వరుం డోప్రియులా రా నీకు భర్త లయి దుగు పొయ్యెదరు అని వరంబాసు గెను. ఆకారణమున నామె పొండ వులకుఁ బ్రియురా లగుపల్ని యయ్యె. ఓనారదా ప్రస్తావము సర్వముఁ జెప్పితి తిని. ఇంక మొదటికథఁ జెప్పెద వినుము. అంత రాముండు లంక యందు మనోహారిణి యగుసీతం జండియాలంకను విభీషణుని కొసంగి మరల నయోధ్యకుం జని భారతవర్షమున నందుఁ బదునొకండువేల యేండ్లు రాజ్య పాలనము సలిపి సర్వజనములఁ దోడుకొని వైకుంఠము నకుం బోయెను. కమలాంశ యగునా వేదవతి కమలయందుం ప్రవేశించె, ఓనార దాపుణ్యప్రదంబయినయీయాఖ్యానముఁ జెప్పి తిని.దీనివలనఁ బాప ములు నశించును. నాలుగు వేదములు మూర్తివంతము లై యామె జిహ్వా గ్రమున సతతము వర్తించుచుండుం గాన నాయమ వేదవతి యని చెప్పంబడును.కుశ ధ్వజసుత యగు వేదవతియుపాఖ్యానము సంక్షేపము గఁ దెల్పితిని. ఇంక ధర్మధ్వజునికూతును పాఖ్యానముఁ దెల్పెదను. వినుము.

ఇది బ్రహవైవర్తమహాపురాణమునం బ్రకృతిఖండమునందు నారాయణ

నారదసంవాదమునం జతుర్దశాధ్యాయము

ముగిసెను.