పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము.

రాముఁడు లక్ష్మణునింగాంచి మిగుల దుఃఖించి వేగిరం బ స్వాశ్రమము నకుం జను దెంచి సీతాదేవిం గానక విషాదమున సుచిరకాలము మూర్ఛ ఇంది మరల విశేషముగ విలపించెను. ఆగహనమునందు నాసీతను వెద కుచు మరలఁ బరిభ్రమించుచుఁ గొంత కాలమునకు నదీతటమునం బక్షి చే సీతావృత్తాంతం బెఱింగి యాహరి వానరుని సహాయము గాఁ గొని సాగరము బంధించి లంకకుం జని యారఘు శ్రేష్ఠుండు సాయకములచే రావణుని సబాంధవను గఁ జంపి దుఃఖత యగుసీతాదేవిం బడసి సత్వ

త్రిహాయణిచరితము.

రము గ సామెకు వహ్ని పరీక్ష చేయించెను. ఆకాలమున హుతాశ నుండు వాస్తవి యగుజానకి నొసం 7. అప్పుడు ఛాయాసీత వినయా'న్విత యయి వహ్ని దేవుని రామునిఁ గాంచి యే నేమి సేయంగలను. అందు కుపాయము దెల్పుఁడు”అని ప్రార్థింపఁ గా పహ్ని యి ట్లనియె. ఓ దేవి నీవు పుణ్యప్రద మగుపుష్కర క్షేత్రమునకుం జనుము. అచట తపం బొన రించి నీవు స్వర్గ లక్ష్మివి గాఁబోయెదవు. అని చెప్పిన వహ్ని వచనంబు లాలకించి పుష్కరమునం దపంబాచరించి యాఛాయాసీత మూఁడు లక్షలది వ్యవర్ష ములకు స్వర్గమున స్వర్గ లక్ష్మి యయి వెల సెను. ఆయమ కాలక్రమమునం దిపము చేసి యజ్ఞకుండమున జనియించి పాండవులకుం గామిని యగుచౌపది గా ద్రుపదునికిం బుత్రి యయి 'వెల సె' కృతయు గమున వేదవతి యను నామముతోఁ గుశధ్వజునికిం గూఁతురయ్యెను. తేతాయుగమున రామపత్ని యగుసీతా దేవియనం బరఁగుచు జనకు నికిం దనుజాత యయ్యె. ద్వాపరమున నాయమఛాయ ద్రౌపదీ దేవి యను పేరం బరఁగుచు ద్రుపదునికిం జని యించెను. గాన నీయమ యుగ శ్రయమున నుండునది యగుటం జేసి త్రిహాయణి యని చెప్పంబడియె. అని చెప్పిన నారాయణునిం గాంచి నారదుండు నోసం దేహభంజనుఁడా మునిపుంగవుఁడా ఆయమకుం బతు లయిదుగు టైరది యెట్లో యీసంశ