పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము.

వదలి నీవు నీ సమీపమునం దచ్ఛాయ నుంచుకొని రక్షింపుము. మరల బరీక్షా సమయమునందు సీతాదేవిని నీ కొసం గెదను. నన్ను దేవత లంపిరి. నేను విప్రుండను గాను. హుతాశనుఁడను అని చెప్పఁగా (గా నాతని వచనంబులు విని లక్ష్మణుని కది ప్రకాశింపఁ జేయక య దూయమానం బయినహృదయంబుతో స్వచ్ఛందంబు గఁ గైకొనియెను, వహ్ని యుఁ దనయోగబలంబు చేత సీతవలననుండి మాయాసీతం బుట్టించి యాసీతాదేవికి సమానము లగుగుణంబులు ను సర్వాంశంబులు ను గలయా మాయాసీతను రాముని కొసం గెను. ఇట్లాసంగి యావహ్ని యిది గోప నీయము. దీని నితరులకుఁ దెలియపఱచం గూడ" దనిని షేధించి సీతం దీసికొని పోయెను. ఈ గోప్యంబు లక్ష్మణుఁడు సయిత మెఱుంగఁడట్లుండ నితరుల కె బ్లెఱుంగనగు. ఆ సమయంబున రాముఁడు సువర్ణ మృగంబుం గనుంగొనియె. సీత యాకనకమృగంబును బట్టి తెమ్మని ప్రయత్న పూర్వ కంబు గ నాతనిం బం పె. రాముఁడు జానకిరక్షణంబును లక్ష్మణునియందు వదలి పెట్టి వనంబునందు నామృగంబును వెబడించిచని దానిని సాయ కంబునం జంపె, ఆమాయామృగము లక్ష్మణా! యని కూసి యెదుట శ్రీ హరిం గాంచిస్మరించుచు వైశం బ ప్రాణములు వద లెను. ఆతఁడు మృగ రూపమును పరిత్యజించి దివ్యరూపముఁ దాల్చి రత్న నిర్మితం బయిన విమానమున వైకుంఠమునకుం జనియెను. వైకుంఠమునం బ్రతి ద్వారము నందు ను ద్వారపాలకులకు ఁ గింకరుం డుండు.అందు జయవిజయులకుం గింకరుండు జితుం డనువాఁడు. మిగులబలవంతుండు. వాఁడు సనకాదుల శాపముచేత రాక్ష సతనువుం జెంది యుండి యాతఁడు మరల ద్వార పాల కులకు ముం దయాద్వారమును జే రెను.అంతసీత, లక్ష్మణాయని చెప్పినవిళ్ల బంబయినవచనము విని రాముని సన్ని ధికి లక్ష్మణునిఁ బం పెను లక్ష్మణుండు రామునొద్దకుం. జనఁ గా దుర్ని వారణుం డగురావణుండు చనుంచి లీలమెయి సీత నపహరించుకొని లంకకుం జనియె. అచట వనంబున