పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము,

తపఃప్రశ్నము సేయుట యయోగ్యము. జ్ఞానాధి దేవత వయి సర్వ జ్ఞుఁడ వగు నిన్ను వృధా జ్ఞానప్రశ్న మేల సేయవలయు? మృత్యుం జయఁడ వై ననీకు విషత్తు లేని కాలమున నాప్రశ్న ము వలదు' వీయింటికి నీవు నచ్చినప్పు ఉలవచ్చితి వని ప్రశ్నము సేయుట నాకనుమతముగాదు. అయినను నీవు తాసముతో నియ్యెడకువచ్చుటకుం గారణ మేమి యని యడుగవలసియున్న ది, అందుకుఁ గారణముఁ దెల్పుము.

అని యడిగిన మహా దేవుం డి ట్లనియె. ఓహరీ నాభ క్తుండు ను నాకు నా ప్రాణములకంటె నధికప్రియుండు నగువృషధ్వజుని సూర్యుం డు శపియిం చెనని నాకుం గోపముసు డ్రా సమును గల్గి యున్న ది. భ క్తు సందలిపుత్రవాత్సల్యమున నై నశోకము చేత సూర్యునిం జంపుటకుం గడంగితిని. ఆతఁడు బ్రహను శరణుజొచ్చెను, ఆబ్రహ సూర్యునిం దోడ్ - ని నిన్ను శరణుజొచ్చి యున్న వాఁడు. ఏనరులు ధ్యానంబున నైన సచనముల నైన నిన్ను శరణు వేడెదరో ; వారలు విపత్తు గడచి శంకావివర్జితు లై మృత్యువును జయింతురు. అట్లుండ నిన్ను సాక్షాచ్ఛ రణము జెందిన వారలఫలం బే మని పొగడుదును, హరిస్మరణం - బెల్లప్పు డునభయం బొసంగునది. సర్వమంగళములు ను 'దానం గలుగు. ఓజగ తీభూ సూర్యుని శాపంబుకతమున సీరి చెడి మూడుం డై యుండు నాభ కునికిఁ గాఁగ లగతి యేమి? నా కది వచియింపుము. అని యడిగిన భగవంతుం డి ట్లనియె. ఈ వైకుంఠ Wన నర్ధక్షణమునకు భూమియందు నిజువది యొక్క యుగముల కాలము గైవము చే నతీతంబయ్యె. వేగంబ నృపాలయమునకుం జనుము. దుర్ని వారము ను మహాదారుణము నగుకాలము చేత వృషధ్వజుండు మృతుం డయ్యె. ఆతనికుమారుండు హంసధ్వజుండు ను సిరిచెడి యుండి మృతుం డయ్యె. ఆతని పుత్రులు ధరధ్వజుండు ను కుశ ధ్వజుండు ననుమహాభాగులు సూర్యని శాపమున హతశ్రీకు లయి రాజ్యభ్రష్టు లగుచు లక్ష్మి నిగూర్చి తపము సల్పెదరు.