పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 బ్రహవైవర్తమహాపురాణము, ప్రకృతిఖండము.

భక్తి వినమ్రం బయినకంఠముతోఁ బరాత్పరుడు ను శాంతుండు నమనలక్ష్మీ కాంతునికి నమస్కరిం చెను. ఇట్లు రత్న మయభూషణభూషితుఁ డయి; కిరీటమును, కుండలములను, వనమాలయు, చక్రాయుధమును దాల్చి; నవీననీరదమున కొప్పయిన శ్యామసుందర విగ్రహముతోఁ ' జతు ర్భుజములతోఁ జందనం బలఁదినసర్వాంగములతో(బీతాంబరముతో బొడసూపుచు; లక్ష్మీ దేవి యందిచ్చు తాంబూలము భుజియించుచు;మంద స్మి తసుందరముఖారవిందుడైఁ విద్యాధరకాంతలు నేయున స్తనము సూచుచు చతుర్భుజు లగు పార్షదులు వింజామరములు వీచుచుండ రత్న సింహాసనమున వేంచేసియుండునా 'పరమాతునికి భక్తానుగ్రహ విగ్రహుం డగువానికి నమస్కృతు లొనరించి యమహా దేవుండు బ్రహకును ప్రణామంబుఁ గావించె. సూర్యుండును సంత్రస్తుం డగుచు భక్తితోఁ జంద్ర శేఖరునికి నమస్కరించెను. కశ్యపుఁ డాతని నతి భక్తితో సంస్తుతించి నితి యొనరించె, శివుండు సర్వేశ్వరుని సంస్తుతించి మణిమయా సనంబునం గూరుచుండెను. ఇట్లున్న తాసనంబునందు సుఖా సీనుం డై విశ్రమించి యుండుచంద్ర శేఖరునికి విష్ణు పొర్షదులు దగ్గరి శ్వేత చామరంబులచే మందమారుతంబు లొలయ వీఁచుచుండిరి. సత్త్య మయుని స్వర్గంబునఁ గోధం బడఁగి ప్రసన్నుండయి ముదంబునమంద సితంబుతో నాశంకరుండు పంచవ క్తంబులను పరుండు ను విభుండు నగునారాయణుని స్తుతించుచుండెను. నారాయణుండు ప్రసన్నాతుం డగుచు సుధామధురంబులు మనోహరంబులునగువచనంబులతో దేవ సభయందు భగవంతుండగునా చంద్ర శేఖరునితో నిట్లనియె. ఓమహా దేవా శివుఁడ వగునిన్ను గుఱించి శివప్రశ్న మొనరించుటయ త్యంతమవహాస్య మగును. అట్లయ్యును శివస్రశ్న ము సేయుట లౌకిక మనియు వైదిక మనియు సేయుచున్నాను. తపములకు ఫలము లొసంగువాఁడవై సర్వము లగుసంపదల నిచ్చుచుండునట్టినిన్ను గుఱించి సంపత్నము