పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము. 3

నేనుండఁగా మీకు భయ మెక్కడిది? ఎవ్వరు విపదము సంభవించి నప్పుడు భయముఁ జెంది నన్ను సంస రిం చెదరో వారలను వా రుం డుచోటికి చక్రాయుధుండ నై వేగం బ చని రక్షించుచుండుదును. ఓదేవతలారా నేను జగములకుఁ బాలకుఁడను. నేను నిరతము సృష్టి కర్తను. బ్రహస్వరూపమున సృజించెదను.. శివరూపమున సంహరిం చెదను. "నేన శివుఁడను. బ్రహ వగునీవును నేన. త్రిగుణాత్మకుఁ డగు సూర్యుండు ను నేన, నానారూపములం దాల్చి సృష్టిని పరిపాలిం చుచున్నాఁడను. మీరలు. పొండు. మీకు శుభ మగును. భయము మీ కేల? ఇది దొట్టి నావరము చేత శంకరునివలని భయము మీకు లేదు. భగవంతుం డగునీశంకరుండు శీఘ్రము గ సంతోషము నొందువాడు. అతఁడు సత్పురుషులకు గతి యగువాఁడు. సుదర్శన చక్రమునందును శివునియందును నాకు నా ప్రాణములకం టెఁ బ్రియ మధిక మై యుండు. ఈయిఱువురకం టెఁ దేజస్వి యగువాఁడు బ్రహ్లాండముల లేఁడు, మహాదేవుఁడు లీల'మెయి గోటి సూర్యుల నైనను సృజియింప శక్తుఁడు, ఇట్టి బ్రహలను కోటిసంఖ్యుల నైనఁ గలిగించును. ఆళూలి కసాధ్య మేమి యున్నది! నన్ను దీవానిశము "ధ్యానించు చుండుటం జేసి యాతనికి బాహ్యజ్ఞాన మొకించుక యుండదు. అతఁ డు భక్తితో నానామములను నాగుణముల నైదు మొగములచేఁ గీ ర్తించుచుండు. నేను ని బ్లాతనికిఁ గల్యాణము గలుగ నగు నని చింతిం చుచుందును. ఎవ్వరు న న్నెట్లు జెం దెదరో వారల నే నట్లు భజియిం చెదను.ఆభగవంతుఁడు శివస్వరూపుఁడు. శివమున కధిదేవత. అతని వలన శివమగును, కాన బుధు లాతని శివుఁ డని పల్కుదురు. అని చెప్పుచుండఁగా నాసమయమున శంకరుఁడు శూలమును కేలు గిలిం చి వృషభారూఢుఁ డై రక్తపంకజములకు సమానము లగులోచన ములతో సయ్యెడకుం జనుదెంచి తూర్ణముగ వృషభ వాహనము డిగ్గి