పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహవైవర్తమహాపురాణము. ప్రకృతిఖండము.

యనువాఁడు విష్ణువ్రత పరాయణుఁడు. అతని పుత్రుఁడు రాజసాసర్ణి యను వాఁడు మహా విష్ణుభ క్తుఁడు, ఆరాజసావర్ణి కుమారుఁడు వృషధ్వజుఁ డనువాఁడు వృషధ్వజునిభక్తుండు. శంభు వాతనియాశ్రమమునందు మూఁడు దేవయుగములు వసియించియుండెను. శివునికి నారాజునం దుఁ బుత్రునికం టె నధికమయిన ప్రీతి గలదు. ఆవృషధ్వజుఁడు యణుని లక్ష్మిని సరస్వతిని గారవింపనివాఁడు, మఱి యాతఁడు సర్వ దేవతల పూజనములు దూరీభూతములు గావించె.మదమతిశయించియా రాజు. భాద్రపదమాసమునఁ బ్రవృత్త మగుమహాలక్ష్మీ పూజనమును ఖండించి మాఘమాసమునఁ బ్రవ ర్తింపంబడు సరస్వతీ పూజనంబును నిలిపి వేసెను. అతఁడు యజ్ఞమును విష్ణు పూజనమును నిందించి నవి సేయక యుండె. శివుఁ డాతనియందుఁ బ్రీతుం డై జేసి యేసురలు ను ఆరా జేంద్రుని శపింప రైరి. దివాకరుఁ డా రాజును శ్రీవిహీనుఁ డగునట్లు శపియిం చె. అది యెఱింగి శంకరుఁడు శూలముఁ గైకొని సూర్యుని పైకిఁ బోవుడు దిననాధుఁడు తనతండ్రి యగుకశ్యపునిఁ దోడుకొని బ్రహలోకమునకుం జని యానలువను శరణుజొచ్చెను. శివుఁడు ను క్రోధము చే ద్రిశూలము హస్తము నఁ దాల్చి బ్రహలోకమునకుఁ బోవ బ్రహ యు భయభ్రాంతుఁ డై సూర్యుని మున్ని డుకొని వైకుంఠమునకుఁ జనియె. అంత శంకరుం డు శూలముఁ దాల్చి తాను సూర్యుని వెంబడించి పరుగిడ బ్రహ గశ్యపుడు సూర్యుండు ను సంత్రాసము నొందుచుఁ దాలు వులఁ దడి యెండఁ గా సర్వేశ్వరుఁ డగునా రా యణుని శరణు కొచ్చిరి. వారలుశిరములు వంచి హరికిఁబ్రగా మములు గావించి మాటి మాటికి. సంస్తుతులు సల్పి యందఱును తమభ సుములకుఁ గారణము విన్న వించుకొనఁ.. గా నారాయణుఁడు .కృపాయ త్తచిత్తు, డై వా రల కభయ మొసఁగి యోభీతులారా మీరు ర్యమున నుండుఁడు