పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హింసకజంతువులదగ్గఱ వసించుటసుఖకరము. ఓవరాననా పురుషులకు వ్యాధిజ్వాల విషజ్వాల యు ను శమము లనవచ్చు. దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణమునకం టె నఃకఠోరమై యుండు. స్త్రీజితుం డగు పురుషునిజీవితము నిష్ఫలము, నిక్కము, వాఁ డొనరించినకర్మము ఫలము నొసంగదు. హౌఁ డియ్యెడ నంతట నిందితుం డై పరమున నర కమునొందు, యశఃకీర్తి విహీనుం డగు. వాఁడు జీవించియున్న ను మృ తుండయగు. అగ్ను లు ను చవతులు నొక్క యెడ నుండిన శ్రేయము చెడు, ఒక భార్య గలవాఁడు సుఖముఁ బడయు, పెక్కండ్రు భార్యలు గలవాని కొకప్పుడు ను సుఖము లేదు. ఓగంగా నీవు శివాలయమునకుం బొము, ఓ సర స్వతీ నీవు చతుర్ముఖునియింటికిం జనుము. సుశీల యగు కమలాలయ యియ్యెడ నాయింట నుండుఁగాత. ఎవ్వనిపత్ని సుఖసాధ్య యయి సుశీలము గలిగి పతివ్రత యైయుడు. అతని కిహంబున స్వ ర్గసుఖము ను పరము న ధర్మ మోక్షములు ను గలుగు. ఎవ్వనికిఁ బతి వ్రత పల్ని యగునో! వాఁడు ము కుండు ను శుచి యు సుఖి యు నై యుండు. దుశ్శీలముగలది యెవ్వనికిఁ బత్ని యగు; వాఁడు జీవన్ళు తుండు అశుచి దుఃఖి యు నై యుండు. ఓనొరదా యిట్లు వచియించి జగత్పతి యూరకుండ నాలక్ష్మీ వాణీగంగ లొండొరుల నాలింగనము చేసికొని పెద్ద పెట్టున నేడిచిరి. ఇట్లు కొంతతడవు రోగనము చేసి యాకాంతలు శోకమునం గన్ను ల బాష్పము లురుల నంగములు వడంక భయము పై కొనం జేయునది యెఱుంగక చింతాసం తాపదంతురిత స్వాంత లై యాలో చించి క్రమముగ నాజగత్పతి కి ట్లనిరి. అందు సర స్వతి యోనాథా నాయపరాధము క్షమింపుము. దుష్టురాల నగునన్ను దండింపుము, ఎట్టి స్త్రీ లైన నుత్తమ కాంతునిచేఁ బరిత్య క్త లయి రేని యెయ్యెడ జీవింపఁగలరు. యోగము చేత భారతమున దేహత్యాగముఁ జేసికొని యెదను. అత్యుచ్ఛితుఁ డగువాఁడు నిశ్చయముగ నిపాతము