పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

యాహరిప్రియ యీవిపరీతంబున సహనంబుఁ గైకొనియున్నయది. దుర్భగ నగునే నియ్యెడ జీవించుటచే నేమి ఫలంబు. ఎవ్వతే భర్తృప్రీతివంచితయో దానిజీవనము నిష్ఫలంబు. నిన్ను సత్వరూపుఁడ వనియు సర్వేశ్వరుఁడ వనియుం జెప్పెడిమనీషులు మూర్ఖులు. వారు వేదజ్ఞులు గారు. నీబుద్ధి వారలకు విజ్ఞాతంబు గాదు. అని యిట్లు పల్కిన సరస్వతివచనంబులు విని క్రోధసంయుత యగునాయమం గనుంగొని శ్రీహరి తనమానసంబున నాలోచించి యాసభ వాసి వెలికిం జనియె. ఇట్లు నారాయణుండు సనినయనంతరము గంగపై రోసగించి రాగాధిష్ఠాతృదేవత యగునాసరస్వతి నిర్భయమై శ్రవణపరుషంబుగ నిట్లనియె. ఓలజ్జావిహీనురాలా నీ కింతకామంబు తగునటవే? భర్త నీయం దనురక్తుం డై యున్నవాఁ డని గర్వించెదవా యేమి? లేక నీసౌభాగ్యంబును మా కధికంబుగ నెఱింగింపం గోరెదవా? ఆహరి సూచుచుండునప్పుడ నీమానంబును చూర్ణంబుఁ గావించెదను. ఓకాంతా యాతండు నీ కేమి సేయం గలండొ? చూచెదను. అతఁడు నాకును ప్రాణనాయకుండ యగు. అని యిట్లు దూషించి గంగాదేవిశిరోజంబులు పట్టి తిగియ నుద్యమింప నాసరస్వతికిని గంగకును మధ్యప్రదేశమున నిలిచి లక్ష్మీదేవి వాణిని నివారించెను. అప్పుడు సరస్వతి మహాకోపవతియై యాలక్ష్మి నిట్లు శపియించె. ఓలక్ష్మీ నీ విట్టివిపరీతంబుఁ గనుంగొని యేమియుం జెప్పక సభామధ్యంబున వృక్షంబువలె నిలిచి నదివలె నడ్డగించుచుండెదవు గాన నీకు వృక్షరూపంబును నదీస్వరూపంబును సిద్ధించుఁగాత. సందియము లేదు. అని యిట్లు శపియించిన నాసరస్వతి పల్కులు విని యాలక్ష్మి మరల నామెను శపియింప లేదు. కోపించుకొన లేదు. మఱి యామె దుఃఖించుచు వాణిని కరంబునం బట్టుకొని యయ్యెడన నిలిచియుండెను. అప్పుడు కోపంబు మొగంబున నినుమడింపఁ పైపై మించుచుండునావాణిని గనుంగొని గంగాదేవి లక్ష్మీదేవితో