పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

శ్లో| శ్రీమద్యశోదాత్త జాతం తార్తిహరణోద్యమం. |
వం చేరాధాకుచాభోగకుంకుమాంకితవక్ష సం

[ఇచట . నీగుఱు తుండులము మొదలు ఈగుఱుతు మరల వేసియుండుస్థలము దమక నుండుకథ పద్యరూపముగ వ్రాసి యింతకుముందు జేర్పబడినను ఆది కొందఱకు సుఖబోధము కా దని మరల వచనరూపంబుగ వ్రాసి యిందు జేర్చియున్నాను]


శ్రీనారాయణమహర్షి నారదుని కిట్లనియె, ఓనారదా పురాతనం బగునీకథ నీకుం దెల్పెదను. వినుము. ఆకథను స్మరించుకొన్న మాత్రాన సర్వపాపంబులు ను బాసిపోవును. శ్రీవైకుంఠంబునుదు లక్ష్మియు సరస్వతియు గంగ యు ననువారు మువ్వురు భార్యలు నారాయణునికిం గలరు. వీరు మువ్వురు ను సమాన ప్రేమగౌరవంబులు గలిగి సంతతము శ్రీహరి సన్నిథియందుఁడుదురు. ఒకప్పుడు గంగాదేవి కామంబు మేరమీజి నాధుండగునారాయణునిమోము బెళుకుఁ జూపులఁ జిఱు నగవుతోఁ గనుంగొనియె. ఆగంగా దేవి మోముఁ గాంచి ప్రభు వగు నారాయణుండు నలఁతినవ్వు నవ్వెను, అది గనుంగొని లక్ష్మీ దేవి యోర్చుకొనియుండెను. సరస్వతి యోర్చుకొనక యాగ్రహంబుర జెందె. లక్ష్మీదేవి సత్వరూపిణి గాన నప్పుకొనుచు నాసర స్వతికిఁ గోప శాంతి గల్గునట్లు బోధించెను. ఆ సరస్వతి, పరవశ యయినదిగాన శాంతిం జెందక కన్ను లందు మొగంబు నందు రక్తకాంతులు మీఱఁగోప వేగంబున నొడలు కంపంబునొందమాటిమాటికి నధరము స్పురియింపఁబటంగాంచియిట్లనియె. ॥సరస్వతీ॥ యోగ్యుఁడు నుత్తముఁడునుధర్తి పుండునునగుభర్తకుఁ గామినులందఱయందు సమ మైన ప్రీతి యుండును. ఖలుం డగువానికి నట్లుండక విపరీతం బైక నంబడుచుండు. ఓగదాధ రా నీకు గంగా దేవియందధిక సౌభాగ్యం బుండునట్లు తోఁచుచున్నది. ఓప్రభూ కమలా దేవియందును తత్తుల్య సౌభాగ్యం బున్నట్లు నీవు దలం చెదవు. నాయం దది లేదు, లక్ష్మీదేవికి గంగతో సుసమ్మతం బగుప్రీతి గలదు. ఆ ట్లగుటం జేసియే