76
తిక్కన సోమయాజి
"ఉ. జాత్యనుగామి నొప్పయినసంస్కృత మెయ్యడఁ జొన్ప వాక్యసాం
గత్యము సేయుచో నయినగర్వముతోడుగఁ జెప్పి పెట్ట దౌ
ర్గత్యముఁ దోపఁ బ్రాసముప్రకారము వేఱగునక్షరంబులన్
శ్రుత్యనురూప మంచు నిడ శూరుల కివ్విధ మింపుఁ బెంపదే."
"క. లలితపదహృద్యపద్యం
బు లనపదార్థంబు ఘటితపూర్వాపరమై
యలతియలంతి తునియలుగ
హలసంధించిన విధంబు నమరగ వలయు౯."
ఇట్లు తిక్కన కుకవినిందను జేసియు, సత్కవీంద్రమార్గమును దెలిపియు, కవిత్వపద్దతినిగూర్చి ప్రతిజ్ఞావచనములను బలికియును సంతృప్తినిఁ బడయఁ జూలక తనకావ్యము స్వగుణముచేతఁ గాకపోయినను తనతాత యైనమంత్రి భాస్కరుని సారకవిత్వముచేతనైనను లోక మాదరించు నని యీ క్రిందిపద్యములోఁ జెప్పి యున్నాఁడు.
"గీ. సారకవితాభిరాము గుంటూరిభుని
మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
యైన మన్ననమెయి లోక మాధరించు
వేఱ నాకృతిగుణములు వేయు నేల?"
మొదట మనుమసిద్ది తన్నుమామా యని పిలుచుచున్నందులకుఁ గృతి నిమ్మని యడుగుటయు, అతనిపలుకుఁ దనకునింపు పుట్టించుటయు, తరువాత మనుమసిద్ది కులశీలరూపస్వభావాదులు దలపోసికొని కృతి నొందుట కర్హుండని మనస్సు సమాధానపఱచు కొనుటయు, కుకవినిందఁ జేసియు, కావ్యరచ