ఏడవ యధ్యాయము
77
నావిధానమును దెలిపియు, సత్కవీంద్రమార్గమును సూచించియు, ఉత్తరరామాయణమును రచించుటకుఁ గల కారణమును వ్యక్తీకరించియు, కవిత్వపద్ధతిని గూర్చి ప్రతిజ్ఞావాక్యములను నుడివియుఁ దృప్తిం గనఁజూలక లోక మెట్లాదరించునో యన్న సంకోచము పీడింపఁ దనతాతయైన మంత్రి భాస్కరుని సారకవిత్వ మహిమము నైనఁ దలంచి మన్ననమెయి లోకమాదరించునని సమాధానము చెప్పుకొని తృప్తిగాంచుటయు మొదలగు వానిని బరిశీలించిన పక్షమునఁ దిక్కన రచించినకావ్యములలో నిదిప్రథమకావ్య మని తప్పక స్పురింపఁ గలదు.
తిక్కన తనతాతయైనమంత్రిభాస్కరుని గ్రంథములం బేర్కొన కుండుట మిక్కిలిశోచనీయమైన విషయముగా నున్నది. ఇట్లే మనుమసిద్దిరాజు తండ్రియైన తిక్కరాజునకుఁ గవిసార్వభౌమ బిరుదాంకముగల దని చెప్పినాఁడుగాని యాతఁడు రచించినగ్రంథము లెవ్వియో దెలిపినవాఁడు గాఁడు. నిర్వచనోత్తరరామాయణమును గూర్చి యాంధ్రకవుల చరిత్రమునం దిట్లున్నది.
"తక్కిన తెనుఁగుపుస్తకములవలెఁ గాక రమువంశాదికావ్యముల వలె దీని నీకవి నడుమనడుమ వచనములుంచక సర్వమును పద్యములుగానే రచియించెను. ఈతఁడు రచించిన భారతమువలె నీయుత్తరరామాయణ మంత రసవంతముగాను ప్రౌఢముగాను లేక పోయినను, పదివాక్యసౌష్టవము గలిగి మొత్తముమీద సరసముగానే యున్నది. ఇది బాల్యమునందు రచియింపఁ బడినదగుటచే నిట్లుండి యుండును. ఈగ్రంథమునందు పదకాఠిన్యమంతగా