Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

తిక్కన సోమయాజి


యుద్ధతంత్రము నందును బ్రవీణులై యుండి రనుట కిట్టిదృష్టాంతముల నెన్నియైన యాంధ్రచరిత్రము నుండియు, సారస్వతము నుండియుఁ జూపఁ గలము.

ఇట్లు ప్రచండవిక్రమార్కుఁడై ఘోరసంగ్రామంబున శత్రుసేనను మార్కొని పీనుంగుపెంటలు గావించుచు రణకేళి సల్పుచుండ యాదవవీరులును వెనుదీయక మహోదగ్రులై తిక్కనసైన్యము పైఁబడి కత్తులఁ గఠారుల నీటెలం బొడిచి చక్కాడుచుఁ బెద్దకాలంబు పోరాడ నుభయసైన్యంబు లం బెక్కండ్రు వీరభటులు నేలం గూలిరి. అంతటఁ బిన్నమనాయఁడు ఖడ్గతిక్కనను సమీపించి "ఓవిప్రోత్తమా! యుద్ధముచేయుట బ్రాహ్మణునకుఁ బాడి గాదు. మిమ్ముం జంపిన మాకు బ్రహ్మహత్యాదోషంబు వాటిల్లు ననినామనంబు తల్లడిల్లు చున్నది. తొలంగుట మీకును మాకునుగూడ శ్రేయస్కరం బనియూహింతు” నని గొంతెత్తి గంభీరవాక్యములు పలుకఁ దిక్కనయుఁ “ఓ నాయఁడా! రణశూరుఁడవై బ్రాహ్మణక్షత్రియుండ నగు నాతోడ యుద్ధముసేయఁ జాలక పందక్రియ ధర్మ పన్నంబు లేల చదివెదవు? వానిం గొన్ని నేనెఱుంగుదుం గాని, వీరుండ వౌదువేని కదలక నిలుచుండి యుద్ధముచేసి చెతనయ్యెనేని నా ప్రాణంబులు గొని విజయపతాక మెత్తుము. కాదేని శరణుజొచ్చి మాపుల్లరి మాకుం బెట్టుము." అని 'హెచ్చరింపఁ బిన్నమనాయఁడు బ్రహ్మహత్యాదోషమునకు వెఱచి