పుట:Tikkana-Somayaji.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ యధ్యాయము

67


పోయి శాత్రవులను మార్కొని ప్రచండమైనయుద్ధము చేసెను. ఆతని యుద్ధక్రమము నిట్లొకకవి యభివర్ణించి యున్నాఁడు.

"చ. పదటున వాజి రాహుతులపై దుమికింపుచుఁ దిక్కఁ డార్చిన౯
     బెదరి పరిభ్రమించి కడుఁబిమ్మట వీరులు భీతచిత్తులై
     యదెయదె డాలు వాల్మెఱుఁగు లల్లవె యల్లదె యాతఁడంచన౯
     గొదుకక యాజిచేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై."

ఇట్లే పూర్వము బ్రాహ్మణుఁ డగునండూరి కొమ్మనామాత్యుడు క్రొత్తచర్ల (కొచ్చెర్ల కోట) పరిసరభూములందుఁ గటకరాజుతోఁ బోరాడి చూపినయుద్ధకౌశలమును మంచనకవి తనకేయూర బాహుచరిత్రమునందు,

సీ. నెలకట్టెవాటునఁ జెలఁగి రెంటిని మూఁటిఁ
          గూడ గుఱ్ఱంబులు గుదులుగ్రుచ్చు,
   బ్రతిమొగం బగునరపతుల కత్తళమునఁ
          గడిమ మై వీపులవెడలఁ బొడుచుఁ,
   బందంపుగొఱియలపగిది నేనుంగుల
          ధారశుద్దిగ ససిధార దునుముఁ,
   అదియించుఁ బగిలించుఁ జేతులతీటవో
          వడిగాండ మేసి మావతులతలలు,

గీ. తలపుడికి వ్రేసి మావంతుతలలు శత్రు
   రాజశిరములు ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
   నాగె నుబ్బెడు తనవారువంబుచేత
   మహితశౌర్యుండు కొమ్మనామాత్యవరుఁడు."

అని మిక్కిలి మనోహరముగా వర్ణించి యున్నాఁడు. ఆకాలమునం దిట్లే బ్రాహ్మణమంత్రివర్యులు రాజ్యతంత్రమునందే గాక