ఆఱవ యధ్యాయము
69
యేమిచేయుటకును జేతులును గాళ్ళు నాడక నిచ్చేష్ఠితుఁడై చూచుచుండ, వానిమంత్రి బ్రహ్మరుద్రయ్య యచటికేతెంచి "తిక్కన నేఁ దలంపడి పోకార్చెద నీవటుండు"మని తన ప్రతివీరునిపై హయమును బఱపి యుద్ధము చేయఁగా నిరువుర గుఱ్ఱంబులు నీటెపోటుల నేలం గూల నిరువురును గత్తులు దూసి “హరహరా" యని యభిమన్యులక్ష్మణకుమారులవలె ద్వంద్వయుద్ధముసకుఁగలియంబడి యుభయ సైన్యంబులవారును నివ్వెఱపడి చూచుచుండఁ బెద్దయుం బ్రొద్దు పోరాడి తుదకు నేల కొఱంగిరి. ఆపాటుంగని తిక్కనసైనికులు హతశేషులైన వా రీక్రిందివిధముగాఁ జెప్పుకొని యేడ్వసాగిరఁట,
"సీ. ధైర్యంబు నీమేనఁ దగిలియుండుటఁ జేసి
చలియించి మందరాచలము తిరిగె,
గాంభీర్య మెల్ల నీకడనయుండుటఁ జేసి
కాకుత్థ్సుచే వార్థి కట్టువడియె,
జయలక్ష్మి నీయురస్థ్సలినె యుండుటఁ జేసి
హరి పోయి బలిదాన మడుగుకొనియె,
నాకార మెల్లనీయందె యుండుటఁ జేసి
మరుఁడు చిచ్చునఁబడి మడిసి చనియెఁ,
గీ. దిక్క దండనాథ దేవేంద్రపురికి నీ
వరుగు టెఱిఁగి సగము తిరుగు టుడుగు
నబ్ధి కట్టువిడుచు నచ్యుతు కొదమాను
మరుఁడు మరలఁగలుగు మగలరాజ."
అని తనసైనికు లెల్ల హాహాకారములు సేయుచుండఁ బ్రాణ