ఆఱవ యధ్యాయము
65
లాడువారును నై భయభక్తులువిడిచి వర్తించి మనస్సునకు జింతఁ గలిగించిరి. పౌరజనంబులు మాత్రమె గాదు. ఇంటికిఁ బోయినతోడనే వృద్దుఁడై మంచమునఁ బడియున్నతండ్రి సిద్ధనామాత్యుఁడు సయితము కోపము దెచ్చుకొని,
"సీ. రణరంగమున మోహరంబులు పొడఁగని
ప్రాణంబు దాఁచిన పందగజనభు
విజయాధిపునిదాడి వెనుకొని తిరుగక
వెస దప్పివచ్చిన దిగ్గజంబ
పోరఁ జాలక యోడి మారుమాటల మాని
మంచాన కొఱఁగిన మత్తగజమ
పెనుపల్లిచెఱువులో బిరుదు లన్నియు రొంపి
గ్రుంగంగ వచ్చిన కుంజరంబ
ఆ. నేఁడు మొదలుచేసి నెల్లూరిసీమలోఁ
బ్రగడతనము మాని మగిడి తఱలఁ
బూరి గఱచి తిక్క! భూతంబుసోకిసఁ
బాఱువానిరీతిఁ బంద వైతి."
అని యుపాలంభ మొనర్చె నఁట. అంత తిక్కయోధుఁడు తండ్రి పోటుమాటలకు సైరించి స్నాసమునకుఁ బోఁగా వీరపత్నియు, వీరమాతయు నగుభార్యచానమ్మ స్త్రీల కుంచినట్లుగా రహస్యస్థలమున నీళ్లబిందె నుంచి దానికి నులకమంచమును చాటుపెట్టి దానిమీఁదఁ బసపుముద్ద యుంచెనఁట. తనభార్య చెయ్దమును జూచి సిగ్గుపడి తిక్కన ఖేదపడుచుండఁగాఁ జూనమ్మ భర్తను జూచి,