Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

తిక్కన సోమయాజి

"క. పగఱకు వెన్నిచ్చినచో
    నగరే నినుమగతనంపునాయకు లందున్
    ముగురాడువార మైతిమి
    వగపేటికి జలక మాడవచ్చినచోట౯."

అని యెకసక్కెము లాడె నఁట. తరువాత స్నానముచేసి భోజనముసకుఁ బోయి భుజింపునపుడు వీరమాతయగు ప్రోలమ్మ కుమారునకు అన్నములోఁ బాలుపోయునప్పుడు పాలు విఱిగిపోవఁగా నామె సయితము పరిహసముగా,

"క. అసదృశముగా వరివీరులఁ
    బసమీఱఁగ గెలువలేక పందక్రియ న్నీ
    వసి వైచి నిఱిగివచ్చినఁ
    బసులు న్విఱగినవి తిక్క ! పాలు న్విఱిగె౯."

అని పలికె నఁట. ఇఁకఁ జెప్పఁ దగిన దేమున్నది. ఏఁబ దేండ్లు నిండిన యాయోధవరునకు నాపలుకు లెల్లను ములుకులై నాట మానాభిమానములు ముప్పిరిగొనఁ దాను జేసినపనికిఁ బశ్చాత్తప్తుఁడై 'నన్నుఁ బిఱికిపందనుగా వీరుదలంపు చుండిరి. ఈసారి మరలఁ బోయి శాత్రవులను మార్కొని జయము గొందును. ఆయ్యది సంప్రాప్తముగాదేని ప్రాణం బుండుదనుకఁ బోరాడి వీరస్వర్గంబు నైనఁ జూఱఁ గొందు. మానాభిమానములు గలశూరుఁ డిట్టిరోతబ్రదుకుఁ బ్రదుకం జాలఁడు' అని తలపోసుకొని యెవరెన్ని విధములవారించినను వినక సిద్దిరాజు నొడంబఱిచి కావలసినసైన్యములం గొని సంగరోత్సాహియై