అయిదవ యధ్యాయము
59
ములో విక్రమసింహపురమును బలపాలించు చుండెను. ఇంకొకచిత్రము గలదు. గణపతిదేవుని సైన్యాధీశ్వరులలో నొకఁడును, రాయసహస్రమల్లుఁ డనుబిరుదముగల వాఁడును నగు ఆంబదేవమహారాజు రాజ్యపదభ్రష్టుఁ డైన మనుమగండగోపాలుని విక్రమసింహపురంబున సింహాసన మెక్కించితి నని యొకశాసనమునఁ జెప్పుకొని యున్నాఁడు. ఈ మనుమసిద్ధిరాజునే మనుమగొండగోపాలుఁడని వక్కాణించి యుండవచ్చును. ఏలయన నీతెలుఁగుచోడరాజులకు గండగోపాలుఁ డను బిరుదము గలదు. తిక్కరాజునకు రాయగండగోపాలుఁ డనుబిరుదము గలదు. మనుమసిద్దికిని ఈ బిరుదము గలదు. ఇతనికి దాయాది యొకఁడు విజయగండ గోపాలుఁ డని వ్యవహరింపబడుచున్న కారణమున మనుమసిద్ధిని మనుమగండ గోపాలుఁ డనిజనులు వ్యవహరించి యుందురు. మఱియొక కాకతీయసైన్యాధిపతి మనుమగండగోపాలుని సంహరించితి నని చెప్పుకొనియెను. వీనినన్నిటిని బరిశీలించి చూచినపక్షమున నీ క్రింది విధమున సిద్దేశ్వరచరిత్రములోని విషయములను సమన్వయింపవచ్చును. 1257-వ . సంవత్సరమునఁగాని మఱు సంవత్సరముగాని మనుమసిద్ధిదాయాదులు సిద్ధిరాజును నెల్లూరునుండి పాఱఁద్రోలఁగా నతఁడు కందుకూరుసీమలోని పెంట్రాలకోటలోఁ కొంతకాలము దాగి యుండును. ఆకాలమున మహాప్రసిద్ధిగాంచిన యతని మంత్రి తిక్కనసోమయాజి గణ