Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

తిక్కన సోమయాజి


శత్రువులయినవీరులను పట్టాభిషిక్తులను గావించెనని నాలుగవయధ్యాయమునం దెలిపి యున్నాఁడను. వీనిని త్రిభువనచక్రవర్తి బిరుదాంకితుఁ డగువిజయగండగోపాల దేవుఁడు దఱిమి కాంచీపుర మాక్రమించుకొనియె నని వెనుకటియధ్యాయమునఁ దెలిపి యున్నాఁడను. అట్టి విజయగండగోపాలునే విజయక్ష్మాథీశ్వరుం డని తిక్కన నిర్వచనోత్తర రామాయణమునఁ బేర్కొనియె నని వక్కాణించి యున్నాఁడను. ఈనా యూహ సరియైన దైనయెడల నిర్వచనోత్తర రామాయణము 1250 దవ సంవత్సరముతరువాత రచియింపఁబడి యుండును. అప్పటికి మహాభారతము రచియింపఁబడి యుండలేదనుటస్పష్టము. మనుమసిద్దిరాజు పరిపాలనము చేసిన దెప్పటివఱకో తెలిసికొనుట గూడ కష్టసాధ్యముగ నున్నది. మనుమసిద్దిరాజు కాటమరాజుతో యుద్ధము చేసి మరణించెనను మఱియొకకథ గలదు. మనుమసిద్ధికుమారుఁడు తిక్కరాజు 1258-దవ సంవత్సరమునఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. 1262 వ సంవత్సరమునకుఁ దరువాత మనుమసిద్దిశాసనములు గానరాపు. మనుమసిద్ధికుమారుఁడు ఇమ్మడి తిక్కరాజు రాజ్యమునకు వచ్చుటకుఁ బూర్వము కొంతకాలము నెల్లూరిపట్టణము కాకతీయ సైన్యాధిపతుల పాలనమున నున్నట్లు కొన్ని శాసనమువలనఁ గానంబడు చున్నది. దాదినాగయసాహిణి యను నాగదేవమహారాజు గణపతిదేవచక్రవర్తికిఁ బ్రతినిధిగా 1272-73 వ సంవత్సర