Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

45


రుఁడును, మండలీకరవందోలియు, జీవరక్షచక్ర నారాయణుఁడును, అగు శ్రీమన్మహామండలేశ్వర శ్రీసారంగపాణి దేవరాజేగాని యన్యుఁడు గాడని తోఁచుచున్నది. ఇతఁడు కాకతీయగణపతిదేవునకు సామంతుఁడుగ నుండి అద్దంకిసీమకుఁ బరిపాలకుఁడుగ నుండెను. ఇతనితండ్రి మాధవదేవరాజు. ఇతఁడు మనుమసిద్దికి సమకాలికుఁ డై యుండెను. గోవిందనాయకుఁ డీతనికి మంత్రిగనుండెను. ఇతని పూర్వులు మహారాష్ట్రములోని శౌణదేశమునుండి వచ్చినటులు దెలియుచున్నది. కాఁబట్టి నిర్వచనోత్తరరామాయణమునఁ బేర్కొనఁ బడినసారంగుఁ డితఁడే యనుటకు సందియము లేదు."

అని వ్రాసి యున్నాఁడను గాని మహారాష్ట్రదేశము నుండి మఱియొక సారంగుఁడు పశ్చిమపాకనాడు పై దండెత్తి వచ్చి దోఁచుకొనఁ బ్రయత్నించు నపుడు మనుమసిద్ది వానిని పాఱఁద్రోలెననియుఁ దెలియుచున్నది. భావి పరిశోధనమునఁ గాని యిదమిత్థ మని నిర్ణయింపఁ జూలము.

బ్రాహ్మణులకు వెలమలకును వివాదము

పూర్వకాలమున ముక్కంటికాడు వెట్టి యను పల్లవరాజొకఁడు శ్రీశైలమునకుఁ దూర్పున నుండుదేశమున డెబ్బది యగ్రహారములను గల్పించి బ్రాహ్మణులకు దానముచేసి యుండెనఁట. అధిరాజేంద్ర చోళమండల మనియెడు పశ్చిమ ప్రాజ్ఞ్నాటిలోని పేరంగండూ రనుగ్రామము వానిలో నొకటిగా నుండెను. ఈగ్రామము నేఁబదిరెండు భాగములుగా విభాగించి ముక్కంటికాడువెట్టి బ్రాహ్మణులకు ధారపోసి యుండెను. అప్పటినుండియు నా బ్రాహ్మణులు పుత్త్రపౌత్ర పారంపర్యముగా