Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

తిక్కన సోమయాజి


నిరాతంకముగా ననుభవించు చుండిరి. ఇట్లుండ సకలికోడూరులో నుండు వ్యవసాయదారులు తమ దేశమునందు గొప్పకలహము జనించుటచేత తమదేశమును విడిచి వలసవచ్చి యీ గ్రామములోని చెఱువున కుత్తరభాగమున వసతు లేర్బఱచుకొని నివసించు చుండిరి. మఱియును ఇనం బ్రోలు గ్రామవాసులైన వెలమలు కొందఱు తమగ్రామమున మహామారి జ్వర మంకురించి ప్రజానాశముఁ గలిగించుచుండుటచేత నాగ్రామమును విడిచిపెట్టి యీబ్రాహ్మణా గ్రహారమునకుఁ జనుదెంచి తా మాక్రమించుకొనెడు పొలములలో నెంతపంటపండునో యంత మొత్తమును బన్నుగాఁ జెల్లించు పద్ధతి పై నొడంబడికఁ జేసికొని గుడిసెలు గట్టుకొని కాపుర ముండుచు వచ్చిరి. తరువాత నొకప్పుడు మీనరాశి యందు శని ప్రవేశించుట చేత దేశమునఁ గాటకము సంభవించెను. ఆకారణముచేత బ్రాహ్మణు లాగ్రామమును విడిచి పెట్టి పోయిరి. కాటకము గడచిపోయిన కొంతకాలమునకు బ్రాహ్మణులు మరల స్వగ్రామములోఁ బ్రవేశించిరి. తమ యొడంబడిక ప్రకారము వెలమలు తమకట్టుబడులను బ్రాహ్మణులకుఁ జెల్లింప రైరి. ఇంతియగాక యాయగ్రహారము పరిపాలనము చేయు నట్టి ప్రభు వైన మనుమసిద్దిరాజు పా లయ్యెను. అందు పై నాబ్రాహ్మణులు పరిపాలనము చేయు నట్టి మనుమసిద్ది రాజుకడకుఁ బోయి తమ కష్టములను గూర్చి మొఱపెట్టుకొనిరి. అతఁడు సదయ హుృద