Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

తిక్కన సోమయాజి


చక్రవర్తి గండికోట, ములికినాడు, రేనాడు, పెనదాడి, సకిలినాడు, ఏరువనాడు, పొత్తపినాడు మొదలగుసీమల నెల్ల జయించి గంగయసాహిణిఁ దనకు సైన్యాధ్యక్షునిగా నియమించి యాతఁడు తనకుఁ బ్రతినిధిగ నుండి పైసీమలఁ బరిపాలించు నటు లనుజ్ఞ నొసంగెను. కాఁబట్టి యప్పటి నుండియు గంగయసాహిణి సర్వాధికారి యై సైన్యాధ్యక్షుఁ డై బాహత్తరినియోగాధిపతి యై ప్రతినిధిపరిపాలకుఁ డై మిగుల వాసి గాంచెను. మాండలికరాజుల నెల్లరను గణపతిదేవ చక్రవర్తికి లోఁబడఁజేసి యెల్లరను శాసించి యదుపులోనుంచి కప్పములు గైకొనుచుఁ బ్రఖ్యాతుఁ డైనందున గంగయసాహిణికి మాండలిక బ్రహ్మరాక్షసుఁ డనియు, రక్కెసగంగనియుఁ బేరులు గలిగెను. .........గంగయసాహిణి చేసిన డాపధర్మములను గూర్చి శాసనము లనేకములు కడప, కందవోలు మండలములలోఁ గానవచ్చుచున్నవి. ఇతఁడు దేవతా బ్రాహ్మణభక్తి గలవాఁడగుటచేత ననేక శివాలయములకును, బ్రాహ్మణులకు ననేక భూదానములను గావించి ప్రఖ్యాతుఁ డయ్యెను."

మఱియు మనుమసిద్ధిరాజు మహారాష్ట్రసామంతుఁ డైనసారంగుని జయించె నని నిర్వచనోత్తర రామాయణమున నీక్రిందిపద్యములోఁ జెప్పఁబడి యున్నది.

"శా. శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే
     దంగంబుల్ మెఱుగేద వించుకయుమాహారాష్ట్రసామంతుసా
     రంగుం దోలి తురంగముం గొనిన సంగ్రామంబునం దృప్తస
     ప్తాంగ స్ఫారయశుండు మన్మవిభు పంపై చన్న సైన్యంబునన్."

ఇందునఁగూర్చి యాంధ్రుల చరిత్రము నందు వ్రాయఁ బడి యున్న వాక్యములనే యిం దుదాహరించు చున్నాఁడను.

“ఇందుఁ బేర్కొనఁ బడినసారంగుఁడు, అతివిషమ హయారూఢ ప్రౌఢరే ఖావంతుఁడును, పరబల కృతాంతుఁడును, శరణాగత వజ్రపంజ