పుట:Tikkana-Somayaji.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

43


యుచున్నది.[1] ఈగంగయసాహిణిం గూర్చి యాంధ్రుల చరిత్రమునం దిట్లు వ్రాయఁ బడియున్నది.

"ఇట్టి మహాపరాక్రమవంతుఁ డైన గంగయసాహిణి వొకమండలాధిపతిగనున్న మనుమసిద్ధి యెట్లు జయించి యతని రాజ్యాంగములెల్ల నాఁచికొనియెనో, ఎట్లాతఁ డాశ్రితుఁ డై యితనిం బ్రార్థించెనో, ఎట్లీతఁడాశ్రితవత్సలవృత్తి యేర్పడు నట్లుగా నాఁచికొన్న రాజ్యాంగము లెల్ల నిచ్చి పదముఁ గైకొనC బంచెనో, ఎంతమాత్రమును బోధపడకున్నది.” అని యీ చరిత్రముయొక్క రెండవప్రకరణములో మనుమసిద్ధిరాజుల గూర్చిన ఘట్టమున వ్రాసి యున్నాఁడను. ఇటీవల స్థానికచరిత్రములం బరిశీలింపఁగా గంగయసాహిణీయొక్క పూర్వవృత్తాంతము గొంతవఱకు దెలియవచ్చినది. గంగయసాహిణి మొట్టమొదట గణపతిదేవ చక్రవర్తి కొల్వులో లేఁడనియు, మనుమసిద్ధిరాజు తండ్రియైన తిరుకాళచోడమహారాజునకు (తిక్కరాజు) అగ్రసేనాధిపతిగ నుండె ననియు సిద్దపటముసీమ లోని యోగూరు స్థానిక చరిత్రమునఁ జెప్పఁబడినది. ఇతఁడు మొదట తిక్కభూపాలునకు సేనాధిపతిగ నుండి యతిని యనంతరమున కలుకడపురవరాధీశ్వరుం డైన శ్రీమన్మహా మండలేశ్వర త్రైలోక్యమల్ల భుజబల వీరనారాయణ రాయదేవ మహారాయల సైన్యాధీశుఁడై మోదుకూరు నందుండి ములికినాటిని బరిపాలనము సేయునపుడు తిక్కరాజు కొడుకైన మనుమసిద్దిరాజుతో యుద్ధము చేసి యుండవచ్చును. ఆయుద్దమునం దోడిపోయి మనుమసిద్ధిని నాశ్రయించి నందువలన నతఁడు తన యాశ్రితవత్సలవృత్తి యేర్పడు నట్లుగా యథాస్థానమునకుం బంచెనని స్పష్టమగుచున్నది. కాకతిగణపతి దేవ

  1. "యోగండ పెండేరక నామధేయః
     కాయస్థ వంశోద్భవ కర్ణధారః
     శ్రీగంగ సేనాపతిరస్యకాన్తా
     కాన్తిర్హిమాం శోరివకౌబలాయః"