పుట:Tikkana-Somayaji.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

తిక్కన సోమయాజి


సంవత్సరము తరువాతనే నిర్వచనోత్తర రామాయణము రచింపఁ బడి యుండవలయును. ఈ త్రిభువన చక్రవర్తి విజయగండ గోపాలుఁడు మనుమసిద్ధికి సమకాలికుఁడు."

మఱియు మన్మజనపాలుఁడు గంగయసాహిని నోడించి తన యాశ్రితవత్సలవృత్తి తేటపడు నట్లుగా బల్విడి నాచికొన్న రాజ్యాంగము లన్నియు నిచ్చి పదముఁ గైకొనఁ బంచెనని నిర్వచనోత్తరరామాయణమున నీక్రిందిపద్యములో వక్కాణింపఁ బడి యున్నది.

"ఉ. రంగ దుదారకీర్తి యగు రక్కెసగంగనిఁ బెంజలంబు మై
     భంగ మొనర్చి మన్మజనపాలుఁడు బల్విడి నాఁచికొన్నరా
     జ్యాంగము లెల్ల నిచ్చి తనయాశ్రితవత్సలవృత్తి యేర్పడ౯
     గంగయసాహిణిం బదముఁ గైకొనఁ బంచెఁ బరాక్ర మోన్నతి౯."

ఈగంగయసాహిణీ కాకతీయాంధ్రచక్రవర్తి యగుగణపతి దేవుని, సైన్యమున కధ్యక్షుఁడును, రాజప్రతినిధి యై నిజామురాష్ట్రములో నిప్పుడు చేరి యున్ననల్లగొండసీమలోని పానగల్లు మొదలుకొని మార్జవాడి (కడపమండలములోని వల్లూరు రాజధాని) వఱకుఁ గల దేశము నంతయుఁ బరిపాలించు చుండిన యొక యున్నత రాజకీయాధికారిగాని సామాన్యుఁడు గాఁడు. ఇతనికి బ్రహ్మరాక్షసుఁ డనుబిరుదుగలదు గనుకనే రక్కెసగంగని పేర్కొనఁ బడియున్నాఁడు. ఈగంగయసాహిణి కాయస్థకులస్థుఁ డని పుష్పగిరిలోని యొకశాసనమువలనఁ దెలి