28
తిక్కన సోమయాజి
గురుసాన్నిధ్యమున వేదాధ్యయనము సేయునాఁడు శుచి వ్రతుఁడై యుండక మానఁడు. ఎప్పుడు విద్యార్థి శుచివ్రతుఁడై విద్యాభ్యాసము చేయునో అప్పుడే వాని తేజస్సు బహిర్వ్యాప్తినిజెందు చున్నది. ఉపనయనానంతర మీతఁడు కనీసము పదునాఱు సంవత్సరము లైనను బ్రహ్మచర్య వ్రతముఁ బూని యుండినఁ గాని సాంగోపాంగముగ వేదముల సభ్యసించుట సాధ్యము గాదు. తిక్కన నేర్చిన విద్యలను బట్టిచూడ నిర్మలమైనమనోవృత్తిగలిగి గురుకులంబున శౌచవ్రతుఁ డై నిర్మల వాయువులను బీల్చుచు, నిర్మలోదకంబుల స్నానమును జేయుచు, నిర్మలజలంబులం ద్రావుచు, పరిపక్వ పదార్థములనే భుజింపుచు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుఁడై , పవిత్రశీలుఁ డై బహుసంవత్సరములు పరిశ్రమ చేసియు నతఁ డారోగ్యవంతుఁడును దృఢగాత్రుఁడు నై యున్నట్లే తోఁచును. ఆరోగ్యవంతుఁ డై తిక్కన వైదికవిద్యలనే గాక లౌకికవిద్యలనుగూడ నభ్యసించెను. 'నీతిచాణక్యుఁ డనియును, సామాద్యుపాయవిదుఁ డనియును, నీతినిపుణమతి జితపురుహూతామాత్యుఁ డనియును, అమరసచివదూయోపహారుఁ డనియును, కేతన ప్రశంసించి యుండుటచేతఁ దిక్కన దండనీతి మొదలగువాని నభ్యసించి నీతిశాస్త్రపారంగుం డయ్యె నని తెలియుచున్నది. "తిక్కచమూపా, తిక్కదండాధీశా" అనిపేర్కొనియుండుటచేతఁ గూడ నీతఁడు మనుమసిద్దిరాజుకడ మంత్రిమాత్రుఁడు మాత్రమె గాక సైన్యాధిపతిగ గూడ నుండినటులు వేద్య మగుచున్నది. ఇతఁ