Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యధ్యాయము

29


డిట్లు ముప్ప దేండ్లువచ్చువఱకు వేదంబులు, వాదంబులు, వీణాది వాద్యంబులు, ఆగమములు, ఆలేఖ్యకర్మంబులు, మంత్రతంత్రంబులు, మందులు, మాయలు, సింధురగంధర్వ శిక్షణములు ధర్మార్థ కామశాస్త్రములు జ్యోతిషము, కవితయు, కావ్యనాటకములు, కథలు, పురాణములు, ఆయుధనైపుణము, అంజనము మొదలుగాఁగల సమస్తవిద్యల సమస్తకళల నభ్యసించి మహామహోపాధ్యాయుఁ డై బ్రవర్తింపు చుండెను.

తిక్కనరూపము

తిక్కనచరిత్రమును జదివెడువారును, వినెడువారును, తిక్కనరూప మెట్లుండు నా యని తలపోయనివా రుండరు. తిక్కనరూపమును జిత్రించుటకుఁ దగినసాధనము లంతగాఁ గానరావు. తిక్కన కంకితముగావింపఁబడిన దశకుమార చరిత్రములో కేతనకవి కొన్ని వర్ణనములను జేసి యున్నాఁడు. కాని వానిని గొంద ఱవిశ్వాసకు లతిశయోక్తులక్రిందను ద్రోసి పుచ్చినను గొంతవఱకు తిక్కనచిత్రపటమును లిఖియించుటకుఁ దోడు సూపక మానవు. తిక్కనమహనీయుని చిత్రపటమును జిత్రించుటకుఁ దొలుతఁ బ్రయత్నించిన యొక విద్యాధికుఁ డైన బుద్ధిశాలి వాక్యములనే నీదిగువ నుదాహరించు చున్నాఁడను.[1]

  1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, (విరోధికృన్నామ సంవత్సరము 1911) 149 పేజీ, మ-రా-రా-శ్రీ జె. కృష్ణరావు, బి.ఏ., బి.ఎల్ , గారిచే వ్రాయబడిన 'తిక్కన సోమయాజి చరిత్రము' అను శీర్షికఁగల వ్యాసమునుండి గ్రహింపఁబడినది.)