Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తిక్కన సోమయాజి


పరిశీలించినప్పుడు తిక్కన నెల్లూరుపురవాసి కాఁడని యెవ్వనికి సందేహము జనింపఁ గలదు? మహాభారతాంధ్రీకరణమునకై తిక్కన సోమయాజి కాశినుండి వచ్చినాఁ డని చెప్పెడు కథ పుక్కిటి పురాణముగాని విశ్వాసపాత్రము కాదు. మనుమసిద్దిరాజు పేరుగాని, నెల్లూరు పురనామముగాని యాంధ్రీకృత భారతమునఁ గానరాకపోయినను తిక్కన నెల్లూరు పురవాసి కాఁడని చెప్పుట సాహస మనిపించుకొనును. తిక్కన వానినుదాహరింప కుండుటకు వేరుకారణములు గలవు. అయ్యవి క్రమముగా బోధపడఁగలవు. వేయునేల? అభినవదండినా వినుతిగాంచిన కేతనమహాకవి తనదశకుమార చరిత్రములో "కొట్టరువు తిక్కనామాత్యునకు నిజస్థానంబగు విక్రమసింహపురం బభివర్ణించెద" నని

"సీ. కరిఘటానిలయంబు తురగజన్మస్థలి
           సంభటనివాసంబు సుకృతకర్మ,
    కర్మఠద్విజగణాకరము రాజన్యవం
           శావాస మర్యవర్యాశ్రమంబు
    కర్ష కా గారంబు కవిబుధసదనంబు
           సుందరీ శృంగార మందిరంబు
    ధనధాన్యసంగ్రహస్థానంబు ధర్మద
           యాచార విద్యావిహారభూమి

    తైలఘృతలవణాది సద్ద్రవ్యపాల
    మమలబహువిధ రత్నరత్నాకరంబు
    మధురజలపూర కాసారమండలంబు
    నాగవిక్రమ సింహాఖ్యనగర మొప్పు.”