మూడవ యధ్యాయము
23
డు అర్చావతారరూపుఁ డై నెల్లూరున వేంచేసియున్న హరిహరనాథుఁడు కాక కేవలమును నద్వైతుల కుపాస్యుం డగు హరిహరులకు నధినాథుఁ డగునద్వయ నిర్గుణబ్రహ్మ మని భారతములోని యాశ్వాసాద్యంతపద్యముల నద్వైతశాస్త్రసంప్రదాయమునఁ జూచిన స్పష్టము కాఁగలదు. కావున భైరెండు యుక్తులును సోమయాజి నెల్లూరుపురవాసి యని చెప్పుటకుం జాలవు. భారతరచనాపూర్వకాలములో సోమయాజి కాశీయాత్రఁ జేయుచుఁ గాశినుండి యీగ్రంథరచనకు వచ్చి యున్నాఁడనిచెప్పెడు సంప్రదాయజ్ఞవాక్య ముభయపక్షములలో నిర్బాధకమే అయి యున్నది."
కవి జీవిత గ్రంథకారుని పైవాక్యములను మనమంతగాఁబాటింప వలసినపని లేదు. నెల్లూరుమండలచరిత్రమును గూర్చికాని కేతన కవికృతమై తిక్కనకంకితము గావింపఁబడిన దశకుమారచరిత్రమును గూర్చి గానితెలియనికాలమున నా గ్రంథకర్త యట్లువ్రాసి యుండెను. ఎక్కడ రసికులగు ప్రభువులుందురో అక్కడఁ గొన్నిదినంబు లుండి యాప్రభుని కొక కృతి యిచ్చి బహుమతుల నంది మరల స్వస్థలమునకుఁబోవు నట్టియాచారముగల కవులసంఘము లోనివంటి వాఁడుగాక తిక్కనకవి ప్రభుకోటిలోఁ జేరిన వాఁడై యున్నవాఁడు. తిక్కనకవి మాత్రుఁడేగాఁడు. మంత్రియు సేనాపతియుఁ గూఁడ నై యున్నవాఁ డని దశకుమార చరిత్రావతారిక వలన స్పష్ట మగుచున్నది. ఇంతియగాక కర్మకుఁడై బహువిధయాగము లనేకము లొనరించుటయు, అగ్రహారములు మొదలగువాని నొసంగి కవిపండితకోటిని సన్మానించుటయు మొదలుగా గలవానిని