Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యధ్యాయము

25


అను పద్యమును జెప్పి నెల్లూరును వర్ణించినదానిఁ జూపుటకంటెఁ దిక్కన నెల్లూరుపురవాసి యనుటకు వేఱొండురుజువు మఱి యేమికావలయును?

తిక్కనబాల్యదశ. వేదవిద్యాభ్యసనము.

ఈమానవ ప్రపంచమునందు ధర్మోపదేష్టలై విఖ్యాతిఁగాంచిన మహాపురుషులలో స్వప్రజ్ఞలను జూపి యడ్డంకుల నెల్లఁగడచి యున్నతపీఠముల నధిష్టించిన వారిలోననేకులు బీదల యిండ్లనేజనించిరి. మనతిక్కనామాత్యునివలేఁ బుట్టుకతోడనే ప్రాభవము గలిగి పుట్టిన యదృష్టశాలి లోకములో నూటికిఁ గోటికి నెక్కడనేని నొక్కఁడు గలఁ డేమో? ప్రాభవము గలిగిన ప్రభువంశమున జనించి ప్రతిభాశాలి యై యాంధ్రప్రపంచ మజ్ఞానాంధకారమునఁ బడి కన్నుఁగానక తడుపుకొనుచు తపించుచున్న కాలమున జ్ఞానతేజస్సును బఱపి సముద్దరించి యానందాబ్ధి నోలలాడింతు నని ప్రతిజ్ఞాదీక్షను వహించి సార్థక జన్ముఁ డైనధన్యుని బాల్యదశ యిట్టిదనితెలుపు లిఖితమూల మేదియును నేడు ప్రత్యక్షముగా నెదుట గానరాకున్నను బరిశ్రమఁ జేసిన ధీవిశారదులకుఁదెలియకపోదు. అక్షరాభ్యాస సంస్కారానంతరమునఁ దిక్కనఁ వేదాదిసమస్త విద్యాభ్యాస విభాసి యగుచు ననుదిన ప్రవర్థనంబుఁ జెందెనని కేతనకవీంద్రుఁడు వాక్రుచ్చియున్నాడు. లౌకికాధికార దూర్వహులైన శ్రీమంతులయింటఁ బుట్టియుఁ దిక్కనవైదిక విద్యాభిలాషి యై