Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ యధ్యాయము

11


ఈకరికాలునకు మహిమానుఁడును, వానికిఁ గరికాలుఁడును, తొండమానుఁడును, దాసవర్మయు నను మూవురు కుమారులు గల రనియును శాసనములు దెలుపుచున్నవి. కరికాలునివంశమునఁ బిజ్జన జనించెను. ఇతనివంశము నుండి రెండు శాఖ లుద్భవించినవి. దాసవర్మ నుండి యొకశాఖ పుట్టెను. [1] కరికాలుని వంశమునఁ బుట్టిన దాసవర్మ మొదట పాకనాటి విషయమును జయించి పొత్తపి పట్టణమును రాజధానిగఁ జేసికొని పరిపాలించె నఁట. [2] ఈపొత్తపి రాజధానిగాఁ గలపొత్తపినాడును బరిపాలించిన చోడులను గూర్చి వివరముగాఁ దెలుపుట కిప్పుడు సాధ్యము గాదు. పొత్తపిచోడుఁ డనునది పెక్కండ్రురాజులకు బిరుదువాచకముగా నుండెను. ఈపొత్తపినాటిని బరిపాలించిన దాసవర్మ సంతతి వారు కమ్మనాటి లోనికొట్యదొనను రాజధానిగఁ జేసికొని పరిపాలించిరి. [3] వీరిచరిత్ర మిచటఁ దెలుపుట యనవసరవిషయము గావున విరమించు

  1. Annual Report, on Epigraphy for 1809. Nos, 183 & 205. ఆంధ్రుల చరిత్రము, రెండవభాగము, రెండవప్రకరణము చూడుడు.
  2. పొత్తపి యనునది. కడపమండలములో పుల్లంపేట తాలూకాలోని టంగటూరునకు సమీపమునం దున్న పోతపి యనుగ్రామమే గాని మఱి యన్యము గాదు.
  3. ఈ కొట్యదొనపట్టణ మిపుడు గుంటూరు మండలము లోని నరసొరాపుపేటకు సామీప్యము నందు కొణిదెన యనునామము తోఁ బరగుచున్నది,