పుట:Tikkana-Somayaji.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

తిక్కన సోమయాజి


చున్నాఁడను. దాసవర్మకు మధురాపట్టణమును జయించుటచేత మథురాంతకుఁ డనుబిరుదము లభించె నఁట. ఈ మథురాంతకుని పేరును తిక్కన తననిర్వచనోత్తర రామాయణమున నుదాహరించియుండ లేదు. విక్రమసింహపురి చోడులలోఁ బెక్కండ్రు మథురాంతక పొత్తపిచోడుఁ డనుబిరుదు నామమును దమపేరులకుఁ జేర్చుకొని శాసనములలో వ్రాయించు కొనుచు వచ్చిరి. తిక్కనసోమయాజి మధురాంతక పొత్తపిచోడునిఁ బ్రశంసింపకపోయినను బిజ్జననుమాత్రము నిర్వచనోత్తరరామాయణమున నభివర్ణించి యున్నాడు. [1] "ఈ బిజ్జలరాజు 1150 మొదలు 1162 సంవత్సరము వఱకు రాజ్యము చేసిన (చాళుక్య) త్రైలోక్యమల్లుని సేనాధిపతిగా నుండి, 1162 వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వరత్వమును తానే యపహరించి, లింగాయతమతమును స్థాపించిన బసవేశ్వరుని తోఁ బుట్టు వగుపద్మావతి యొక్క చక్కఁదనమునకు మక్కువ గొని యామెను వివాహమాడి తనమంత్రినిగాఁ జేసికొన్న యూబసవేశ్వరునిచేతనే చంపఁబడెను.” అని, నెల్లూరి మనుమసిద్ధి రాజుయొక్క పూర్వకుఁ డైన బిజ్జనయే చాళుక్యబిజ్జలుఁ డని యభిప్రాయపడి శ్రీవీరేశలింగము పంతులుగారు తమ

  1. చ. అతనికులంబు నందు నవతారి యుగాంతకృతాంతమూర్తి య
       ప్రతిమన దాస్యతావిభవభాసి విలాసరతీశుఁ డప్రత
       ర్కిత వివిధావధాన పరికీర్తిత నిర్మల వర్తనుండు సం
       శ్రితనిధి ఫుట్టె బిజ్ఞన యశేషధరిత్రియు నులసిల్లగన్.