Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

తిక్కన సోమయాజి


అర్థార్థిలోకావన వ్యాపారవ్రతుఁ డనియును, గౌరీపతి శ్రీపాదప్రవ ణాంతరంగుఁ డనియును, విబుధశ్రేయస్కరుఁ డనియును అభినవదండినా వినుతి గాంచిన కేతనమహాకవి తనదశకుమార చరిత్రము నందు మంత్రిభాస్కరుని నభివర్ణించి యుండుటంజేసి మనమాతని నసామాన్యపురుషుఁ డనియే గ్రహింపవలసి యుండును. ఈమంత్రి భాస్కరుఁడు రామాయణమును మొదట రచింపఁగా నది యేకారణముచేతనో ఆరణ్యకాండము తక్క తక్కినకాండము లన్నియు శిధిలము లై పోవుట చేత హుళక్కి భాస్క రాదికవులు వానిం బూరించి రనియు, ఆరామాయణమే భాస్కరరామాయణ మనుపేరఁ బరగుచున్న దనియు నాంధ్రులచే విశ్వసింపఁ బడుచున్నది. కాని యిది