మొదటి యధ్యాయము
5
యెంతవఱకు విశ్వాసపాత్రమో చెప్పఁ జాలము. భాస్కర రామాయణముఁ గూర్చిన యథార్థకథన మింకను మఱుఁగుననేయున్నది. అయ్యది భావిపరిశోధనముల మూలమునఁ దెలిసికొనవలసి యున్నది.[1]
కొమ్మనదండనాథుడు
మంత్రిభాస్కరునకు మహాసాధ్వి యగుకొమ్మమాంబ గర్భమున నల్వురు పుత్త్రు లుద్భవించి యఖండ యశోధనులై వర్థిల్లిరి. వీరిలోఁగడపటివాఁ డైన కొమ్మనామాత్యుఁడు మంత్రి భాస్కరుని పిమ్మట గుంటూరిసీమను బరిపాలించెను. తనమహా భారతములోని విరాటపర్వమునందు తిక్కనకవి తనతండ్రిని,
"సీ. మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర
మహితుండు భాస్కరమంత్రి తనయుఁ
డన్న మాంబాపతి యనఘులు కేతన
మల్లన సిద్ధ నామాత్యవరుల,
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ
మ్మన దండనాధుఁడు మధురకీర్తి,
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప
విత్రశీలుఁడు సాంగవేదవేది."
అను పద్యములో నభివర్ణించి యుండుటచేత కొమ్మన దండనాథుఁ డనికూడఁ దేటపడు చున్నది. దండనాథుఁ డనసేనాధిపతి. గుంటూరివిభుఁ డనియు, దండనాయకుఁ డనియు వర్ణిం
- ↑ ఈ భాస్కర రామాయణమునుగూర్చి ఆంధ్రులచరిత్రములోఁ పదుమూఁడవ ప్రకరణములో 'సాహిణీకుమారుఁడు భాస్కరరామాయణము' అనుశీర్షికక్రిందను విశేషముగా జర్చింపఁబడి యున్నది