పుట:Tikkana-Somayaji.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

తిక్కన సోమయాజి


యెడల నీయాంధ్రభారత మింతయుత్తమోత్తమకావ్యముగా నుండకయె పోవును. సంస్కృత కావ్యములను భాషాంతరీకరింప వలసినరీతి నిప్పటిపండితులకంటె నెక్కువబాగుగా నెఱింగిన వాఁడె గాని యల్పుడు గాఁడు. ఈసందర్భముననే వ్రాయుచు విజ్ఞానసర్వస్వసంపాదకు లగు శ్రీయుతకొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుగారు "సంస్కృతభారతము బంగారపుముద్ద వంటిది. ఆంధ్రభారత మాముద్దలోనుండి కావలయునంత బంగారమును దీసికొని స్వర్ణ కారునిబుద్ధి వైభవముతోఁ జేయఁబడిన చక్కని సువర్ణకమలము వంటిది. ఉభయభారతములలోని యీభేదముఁ జూపి స్వర్ణకారుని బుద్ధివైభవము వెల్లడిచేయుటయే మాయుద్దేశము." అని యొకచోట వ్రాసి యున్నారు. ఇదియెంతయు సయుక్తికమును సమంజసము నైనవాదము. ఆంధ్రకవుల చరిత్రములో భగవద్గీతలను దెనిగింపనేలేదని వ్రాయఁ బడియెను. తిక్కనసోమయాజి దానిని ముట్టకపోలేదు. దానిని గూడ సంగ్రహముగాఁ దెనిగించియే యున్నాఁ డని కీర్తిశేషులైన శతఘంటము వేంకటరంగశాస్త్రిగారు తాము వ్రాసిన విమర్శనపీఠికలోని దాని నీదిగువ నుదాహరించుచున్నాఁడను.

"భగవద్గీత లీతండు తెనుఁగుసేయక యుపేక్షించె నని జనప్రతీతి కలదు గాని యది యట్లు గాదు. దానింగూడ సంగ్రహముగఁ దెనుఁగుఁ జేసి యున్నాఁడు.

"శ్లో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సావః
    మామకా! పొండవా శ్చైవ కీ మకుర్వతసంజయ.

అనుభగవద్గీతా ప్రథమశ్లోకమును.

"క. మానుగ ధర్మక్షేత్రం
    బైనకురుక్షేత్రమున మహాహవమునకుం