Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

115


నన్నయతిక్కనాదులు సంస్కృత మహాభారతమును యథాక్రమముగా నాంద్రీకరింప లేదనియును, మాతృకకు సరిగా నుండక పోవుటయేగాక మూలములోనిపెక్కు భాగములను దెనిగింపక యు, సంగ్రహపఱిచియు నిచ్చానుసారము రచించినారని యిప్పటిపండితులు కొందఱు దోషారోపణము చేయుచున్నారు. వారిపద్దతియే వీరికి బోధపడినట్టు గన్పట్టదు. ఆంధ్రభారతము సంస్కృతభారతములోనికథను మాత్రము గైకొని స్వతంత్రకావ్యముగా వ్రాయఁబడినగ్రంథమె గాని కేవలము సంస్కృతభారతమునకు భాషాంతరీకరణ మనుకొనుట పొరబాటు. ఇప్పటిసంస్కృత భారతము నన్నయతిక్కనాదులకాలములో నిట్లే యున్నదనుకొనుట మఱియొక పొరబాటు. తిక్కనకృతభారతమును సంస్కృత మహాభారతమునకు భాషాంతరీకరణ మనితలంచుట తిక్కనయెడ మనము సేయునపరాధముగాఁ బరిగణింపవలయును. సంస్కృతమహాభారతము నుండి కథనుమాత్రము గైకొని మూలములో లేని యర్థాలంకారములును, రసభావములును, మానవస్వభావవర్ణనలును విచ్చలవిడిగాఁ బెంచియు, మూలములో విసుగుపుట్టించాడు ననేకదీర్ఘకథానకములను వర్ణనలను, వేదాంతఘట్టములను సంగ్రహపఱిచి యు, నిరంకుశవృత్తి గైకొని మూలముకంటెను వేయిరె ట్లధికమనోహరముగా నుండునటుల రచించిన స్వతంత్రమహాకావ్యమనియే చెప్పఁ దగియున్నదిగాని మఱి యన్యము గాదు. తిక్కనసోమయాజి సంస్కృతభారతములో నున్న దానిని ముక్కకు ముక్కఁగాఁ దెనిగింది పెట్టియుండిన