Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

111


అనుపద్యములోఁ గడపటియాటవెలదిగీతినే స్త్రీపర్వద్వితీయాశ్వాసమున గాంధారి భీష్ముం గూర్చి శోకించుచుఁ గృష్ణునితోఁ జెప్పునప్పుడు మూఁడునాలుగు పాదములలోనుండు 'పదిదినం లోలిమై విరియించి యధిప' యనుపదములను 'పదిదినములు దోలి వినోదించి యనఘ' యనుపదములతో మార్చివ్రాసెను. ద్రోణపర్వము తృతీయాశ్వాసములో సైంధవవధార్థ మర్జునుఁ డరుగుచు ధర్మరాజును బట్టి దుర్యోధనున కిచ్చునటులు ద్రోణుఁడు జేసినప్రతిజ్ఞ మనస్సునకుఁ దట్టఁగా సాత్యకిం బిలిచి యాతనిరక్షణార్థము నియోంగించు నప్పుడు చెప్పిన

"క. మనకునిమిత్తము లెంతయు
    ననుకూలము లయ్యె గెలుతు మాహవమున నేఁ
    జనియెదఁ ప్రతిజ్ఞ దీర్పఁగ
    ననఘా ధర్మసుతురక్ష కరుగుము నీవు౯,"

"క. వినుసింధురాజవధయును
    మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా
    వున నేనొకపని నీవోక
    పనిమేకొని చేయు టరయఁ బాడియ కాదే.

"ఆ. ఏనునిలిచినట్ల కా నూఱడిల్లు నీ
    వున్న నన్నరేశ్వరోత్తముండు
    నిర్బరుండ వగుము నీవు నాదెస నాకు
    హరి గలండు గలఁడె యచట నితఁడు.

వ. ఎల్లభంగుల రాజరక్షణార్థంబుగా నీకుంబోవలయును, బరాక్రమధుర్యుం డగునాచార్యుని ప్రతిన యెఱుంగవే యనుటయు. "