తొమ్మిదవ యధ్యాయము
103
"క. హరిహరనాథునకు మరు
త్సరిదాకల్పితమనోజ్ఞ చరణ శిరస్సుం
దరమూర్తికి భావనత
త్పరచేతోయుక్త భక్తపరతంత్రునకు౯."
తాను 'విన్నపంబు సేయుతెఱంగుగా నంతస్సన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబుసేయు' వాడై
“శ. జలనిధిహిమవద్భూధర
కలితజననకేళి కౌతుకవ్యక్తావ్య
క్తలలిత సౌందర్యస్ఫుర
దలఘుతను స్త్రీసవాథ హరిహరనాథా!"
"దేవా దివ్యచిత్తంబున నవధరింపు" మని హరిహరనాథునిఁ బ్రసాదాభిముఖుని గావించుకొని విరాటపర్వము మొదలుగా స్వర్గారోహణపర్యంతముఁ బదునేనుబర్వముల నాంద్రీకరించి యాంధ్రదేశీ యుల నుద్ధరించి,
చ. పరమపదాప్తిహేతు వగుభారతసంహిత శౌనకాదిభూ
సురవరు లింపునం గరంగుచొప్పనఁ జెప్పిన వారు మోదసం
భరితతఁ బొంది యక్కథకు బ్రాఁతిగ నర్పితుఁ జేసి రర్మిలి౯
హరిహరనాథ సర్వభువనార్చిత న౯ దయఁ జూడు మెప్పుడు౯."
అనుపద్యమున హరిహరనాథుని సదయావలోకనముఁ బ్రార్థించి స్వర్గారోహణపర్వాంతమున నున్నమాలినీవృత్తములో "సంభృతానందభావా" యనుసంబోధనమునఁ దాను మొదటఁ గోరిన 'బ్రహ్మానంద సంభృతిని' వచించెను.